శరవేగంగా షూటింగ్‌ని పూర్తి చేసి వచ్చే ఏడాది సమ్మర్ కి విడుదల చేయాలని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో `దేవర` సినిమాకి సంబంధించిన షూటింగ్ అప్ డేట్ ఇచ్చింది యూనిట్.
ఎన్టీఆర్(NTR).. `ఆర్‌ఆర్‌ఆర్` వంటి గ్లోబల్ ఫిల్మ్ తర్వాత చేస్తున్న చిత్రం `దేవర`(Devara). సందేశాన్ని, కమర్షియల్ అంశాలను జోడించి అద్భుతమైన సినిమాలు తీయగల దర్శకుడు కొరటాల శివ డైరెక్షన్‌లో రూపొందుతున్న చిత్రమిది. భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా స్కేల్‌లో రూపొందిస్తున్నారు. `ఆర్‌ఆర్‌ఆర్` ని పక్కన పెడితే ఎన్టీఆర్ నటిస్తున్న తొలి పాన్ ఇండియా మూవీ ఇది. ఇందులో బాలీవుడ్ ముద్దుగుమ్మ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుంది. ఆమె తెలుగులోకి ఎంట్రీ ఇస్తూ చేస్తున్న మూవీ ఇది.
దాదాపు ఏడాదిపాటు లేట్‌గా షూటింగ్ స్టార్ట్ అయినా, గ్యాప్ లేకుండా చిత్రీకరణ జరుపుతున్నారు. శరవేగంగా షూటింగ్‌ని పూర్తి చేసి వచ్చే ఏడాది సమ్మర్ కి విడుదల చేయాలని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో `దేవర` సినిమాకి సంబంధించిన షూటింగ్ అప్ డేట్ (Devera Shooting Update) ఇచ్చింది యూనిట్. కొత్త షెడ్యూలర్ స్టార్ట్ అయ్యింది. చిన్న గ్యాప్ తర్వాత నేటి(సోమవారం) నుంచి తదుపరి చిత్రీకరణ ప్రారంభించారట. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడించింది `దేవర` యూనిట్.
`షార్ట్ బ్రేక్, కొన్ని రోజుల రిహార్సల్స్ తర్వాత భారీ స్థాయిలో యాక్షన్ సీక్వెన్స్ తీసేందుకు నేటి నుంచి సెట్స్ పైకి తిరగొచ్చాం` అని వెల్లడించింది. ఇందులో నీటి(సముద్రం)లో భారీ యాక్షన్ సీక్వెన్స్ ని చిత్రీకరించబోతున్నారట. సినిమాకవి హైలైట్‌గా ఉండబోతున్నాయని సమాచారం. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన కీలకమైన మూడు షెడ్యూల్స్ కంప్లీట్ చేశారు. అయితే సినిమాలోని యాక్షన్ సీన్స్ మొదట కంప్లీట్ చేయబోతున్నారని, ఆ తర్వాత టాకీ పార్ట్ షూట్ చేయనున్నట్టు సమాచారం.
సముద్ర తీర ప్రాంతం బ్యాక్ డ్రాప్‌లో సాగే చిత్రమిది. గుర్తింపుకు నోచుకుని, అందరు వదిలేసిన ఓ తీర ప్రాంతంలో సాగే కథ ఇది అని తెలుస్తుంది. అక్కడ మనుషులకు భయం అంటే తెలియదట. దేవడంటే భయం లేదు, చావంటే అసలే భయం లేదట. అత్యంత క్రూరంగా ఉంటారని, అలాంటి వారికి హీరో ఎలా భయం తెప్పించాడు, వారిని ఎలా ఎదుర్కొన్నారు, వారిని ఎలా సరైన దారిలో పెట్టాడనే కథాంశంతో ఈ సినిమా సాగుతుందని తెలుస్తుంది.
`దేవర` మూవీ భారీ లావిష్‌గా, భారీ స్కేల్‌లో రూపొందిస్తున్నారు కొరటాల. దీనికి హాలీవుడ్ స్టంట్ మాస్టర్స్ పనిచేస్తున్నారు. వీరితోపాటు అనిరుధ్ సంగీతం అందిస్తున్న చిత్రానికి సాబు సిరిల్ ప్రొడక్షన్ డిజైనర్‌గా పనిచేస్తున్నారు. రత్నవేలు సినిమాటోగ్రాఫర్‌గా, శ్రీకర్ ప్రసాద్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తుండగా.. ఈ ఏడాది చివరికల్లా షూటింగ్ పూర్తి చేయాలని భావిస్తున్నారు. ఇక సినిమాని వచ్చే ఏడాది సమ్మర్ స్పెషల్‌గా ఏప్రిల్ 5న విడుదల చేయబోతున్నట్టు ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే.
