Asianet News TeluguAsianet News Telugu

`దేవర` గ్లింప్స్ డేట్‌ ఫిక్స్.. ఎన్టీఆర్‌ ఫ్యాన్స్ కి ముందుగానే సంక్రాంతి పండగ..

`దేవర` సినిమా నుంచి రెండు క్రేజీ అప్‌ డేట్లు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. ఎన్టీఆర్‌ పాత్రకి సంబంధించి, అలాగే గ్లింప్స్ రిలీజ్‌ డేట్‌కి సంబంధించిన వార్త వైరల్‌ అవుతుంది. 
 

devara movie glimpse date fix ? pongal will come early to ntr fans arj
Author
First Published Dec 25, 2023, 4:51 PM IST

ఎన్టీఆర్‌ ప్రస్తుతం `దేవర` చిత్రంలో నటిస్తున్నారు. `ఆచార్య` వంటి డిజాస్టర్‌ తర్వాత దర్శకుడు కొరటాల శివ నుంచి ఈ మూవీ రూపొందుతుంది. దీన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు దర్శకుడు. అందుకే భారీ బడ్జెట్‌తో, భారీ కాస్టింగ్‌తో రూపొందిస్తున్నారు. ఇందులో బాలీవుడ్‌ నటుడు సైఫ్‌ అలీ ఖాన్‌ విలన్‌గా నటిస్తున్నారు. ఆయనతోపాటు బాలీవుడ్‌ బ్యూటీ జాన్వీ కపూర్‌ హీరోయిన్‌గా చేస్తుంది. ఈ ఇద్దరు టాలీవుడ్‌ ఎంట్రీ ఇస్తున్నారు. దీంతో సినిమా స్కేల్‌ భారీగా పెరిగింది. 

దీనికితోడు ఓ బలమైన కథని చెప్పబోతున్నారు కొరటాల. ఓ రా అండ్‌ రస్టిక్‌గా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. మొన్నటి వరకు శరవేగంగా చిత్రీకరణ జరుపుకున్న ఈ మూవీ తాజాగా కాస్త బ్రేక్‌ తీసుకున్నట్టు తెలుస్తుంది. ఎన్టీఆర్‌ తన భార్య, పిల్లలతో కలిసి షార్ట్ ట్రిప్‌ వెళ్తున్నారు. విదేశాలకు చెక్కేశారు. తాజాగా ఆయా ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. క్రిస్మస్‌, న్యూ ఇయర్‌ సెలబ్రేషన్స్ అక్కడే ఉంటాయని తెలుస్తుంది. 

ఇదిలా ఉంటే `దేవర` చిత్రం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి అప్‌డేట్‌ లేదు. జస్ట్ ఫస్ట్ లుక్‌ ఇచ్చారు. ఎన్టీఆర్‌ ఫస్ట్ లుక్‌, జాన్వీ కపూర్‌ లుక్‌ మాత్రమే వచ్చింది. కానీ ఇప్పటి వరకు గ్లింప్స్ కానీ, టీజర్‌ గానీ రాలేదు.దీంతో ఫ్యాన్స్ అప్‌డేట్‌ కోసం ఈగర్‌గా వెయిట్‌ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో త్వరలో గ్లింప్స్ వదులుతామని కళ్యాణ్‌ రామ్‌ ప్రకటించారు. దానికి సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయట. 

అయితే తాజాగా గ్లింప్స్ కి సంబంధించిన డేట్‌ ఫిక్స్ చేసినట్టు సమాచారం. కొత్త ఏడాది దాటక సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ గ్లింప్స్ ని రిలీజ్‌ చేయబోతున్నారు. జనవరి 8న ముహూర్తం ఫిక్స్ చేసినట్టు టాక్‌. ఇదే నిజమైతే ఎన్టీఆర్‌ ఫ్యాన్స్ సంక్రాంతి పండగ ముందే రాబోతుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. దీనిపై స్పష్టత రావాల్సి ఉంది. ఇదిలా ఉంటే ఈ మూవీలో తారక్‌ గంగమ్మ భక్తుడిగా కనిపిస్తాడట. ఇంటర్వెల్‌ బ్యాంగ్‌లో గంగమ్మ జాతర ఎపిసోడ్‌ ఉంటుందని, అది సినిమాకే హైలైట్‌గా నిలుస్తుందని, ఇందులో తారక నటవిశ్వరూపం చూపిస్తారని టాక్‌. ఇక ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ఏప్రిల్‌ 5న విడుదల చేయబోతున్నారు. రెండు భాగాలుగా ఇది రిలీజ్‌ కానున్న విషయం తెలిసిందే. 
 

Follow Us:
Download App:
  • android
  • ios