ఈ మధ్య ఎక్కువగా దైవర దర్శనాలు చేసుకుంటుంది బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్. ఎక్కువగా తిరుమల తిరుపతి స్వామిని సేవిస్తూ ఉంటుంది. తాజాగా మరోమారు శ్రీవారి సేవలో తరించింది దేవర హీరోయిన్.
బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ తిరుమల తిరుపతిలో సందడి చేశారు. శ్రీ వేంకటేశ్వరస్వామికి పరమ భక్తురాలు అయిన జాన్వీ.. అప్పుడప్పుడు తిరుమల వెంకన్న దర్శనానికి వస్తుంటుంది. ఈమధ్య తిరుమలకు ఆమె ఎక్కువగా వస్తూ వెళ్తున్నారు. తాజాగా కొత్త సంవత్సరంలో స్వామివారి దర్శనం చేసుకోవాలి అనుకున్న జాన్వీ.. నిన్న (జనవరి 4) రాత్రి కాలి నడకన..మెట్ల మార్గం ద్వారా కొండ ఎక్కి.. తిరుమలకు చేరుకుంది. ఈరోజు ( జనవరి 5) జాన్వీ కపూర్ తన పిన్ని, నటి మహేశ్వరితో కలిసి శ్రీవారి దర్శనం చేసుకుంది.
ఇక జాన్వీ కపూర్ తిరుమల వచ్చిందన్న విషయం తెలిసి అభిమానులు హడావిడి చేశారు. స్వామివారి దర్శనం చేసుకుని.. తిరుమల ఆలయం బయట జాన్వీ వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈమెను పలకనిస్తూ... పోటోలు తీసుకోవడం కోసం అభిమానులు ఎగబడ్డారు.పద్దతిగా ఈసారి పట్టు చీరలో వచ్చి దర్శనం చేసుకుంది. తిరుమలలో దిగిన పలు ఫోటోలని, కాలినడకన ఉన్న మెట్లను తన సోషల్ మీడియాలో షేర్ చేసిన జాన్వీ.. 2024 మొదలైంది.. గోవిందా.. గోవిందా.. అని పోస్ట్ చేసింది. దీంతో జాన్వీ పోస్ట్ కూడా వైరల్ గా మారింది. ఇక దేవర సినిమాలో తంగం అనే పల్లెటూరి అమ్మాయి పాత్రలో మెరిపించనుంది జాన్వీ.
ఇక బాలీవుడ్ లో స్టార్ డమ్ తో దూసుకుపోతున్న ఈ బ్యూటీ.. టాలీవుడ్ ఎంట్రీకి రెడీ అయ్యింది. ఎన్టీఆర్ సరసన దేవర సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతోంది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న దేవర సినిమా సక్సెస్ అయితే సౌత్ లో జాన్వీ బిజీ అయిపోయే అవకాశం ఉంది. ఇక దేవరతో పాటు..అటు తమిళంలో కూడా ఆమె ఓ సినిమా చేయబోతున్నట్టు తెలుస్తోంది. ఇక జాన్వీ కపూర్ తన బాయ్ ఫ్రెండ్ శిఖర్ తో.. ఈమద్యఎక్కువగా కనిపిస్తుంది. తిరుమలకువచ్చినా కూడా అతనితో కలిసి వస్తుంది. ఇతర క్షేత్రాలకు వెళ్ళినా అతన్నివెంటపెట్టుకుని తిరుగుతోంది. అంతే కాదు పార్టీలకు పబ్ లకు కూడా ఇద్దరు కలిసి వెళ్తున్నట్టు తెలుస్తోంది.
