Asianet News TeluguAsianet News Telugu

`దేవర` ఫియర్‌ సాంగ్‌కి ముందున్న టార్గెట్‌ ఇదే.. లేదంటే అల్లు అర్జున్‌ ఫ్యాన్స్ వదలరేమో?

ఎన్టీఆర్‌ నటిస్తున్న `దేవర` మూవీ నుంచి మొదటి పాట రాబోతుంది. `ఫీయర్‌` పేరుతో సాగే ఈ పాటని సాయంత్రం రిలీజ్‌ చేస్తారు. అయితే దీనికి ఇప్పటికే టార్గెట్‌ ఫిక్స్ చేశారు. 
 

devara fear song have a target if it is not reach allu arjun fans not leave ? arj
Author
First Published May 19, 2024, 2:28 PM IST

ఎన్టీఆర్‌ ప్రస్తుతం `దేవర` చిత్రంలో నటిస్తున్నారు. ఈ మూవీ నుంచి అప్‌ డేట్‌ రాబోతుంది. ఎన్టీఆర్‌ పుట్టిన రోజు సందర్భాన్ని పురస్కరించుకుని `దేవర` మూవీ నుంచి తొలి పాటని విడుదల చేయబోతున్నారు. `ఫీయర్‌` పేరుతో ఈ పాటని రిలీజ్‌ చేయబోతున్నారు. దీనికి సంబంధించిన హింట్‌ ఇచ్చింది యూనిట్‌. ఈ రోజు(మే19) సాయంత్రం ఏడుగంటలకు ఈ పాటని విడుదల చేయబోతున్నారు. 

దీంతో పాట కోసం ఎన్టీఆర్‌ అభిమానులు ఈగర్‌గా వెయిట్‌ చేస్తున్నారు. ఇప్పటికే రిలీజ్‌ చేసిన ప్రోమో అదిరిపోయింది. పాటపై అంచనాలను పెంచింది. ఈ సాంగ్‌ ఎలా ఉండబోతుందో అనే ఉత్సుకత తారక్‌ ఫ్యాన్స్ లో ఉంది. ఎన్టీఆర్‌ క్యారెక్టరైజేషన్‌ని తెలియజేసేలా, ఆయన్ని ఎలివేట్‌ చేసేలా ఈ పాట సాగుతుందని తెలుస్తుంది. దీనికి అనురుథ్‌ రవిచందర్‌‌ మ్యూజిక్‌ అందిస్తుండగా, తెలుగు, తమిళం, హిందీలో ఈ పాటని అనిరుథ్‌ రవిచందర్‌ ఆలపించగా, కన్నడ, మలయాళంలో సంతోష్‌ వెంకీ పాడారు. 

అయితే ఈ పాట రాకముందే దీనికి టార్గెట్‌ ఫిక్స్ చేశారు అభిమానులు. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఎన్టీఆర్‌, ప్రభాస్‌, అల్లుఅర్జున్‌, రామ్‌ చరణ్‌ ల మధ్య గట్టి పోటీ ఉంది. వీరి భారీ సినిమాలు ప్రస్తుతం లైనప్‌లో ఉన్నాయి. వరుసగా రిలీజ్‌కి రెడీగా ఉన్నాయి. అన్నీ పాన్‌ ఇండియా మూవీస్‌, అన్నీ భారీ మూవీస్‌ కావడంతో ఈ నలుగురు హీరోల సినిమాల మధ్య ప్రతి విషయంలోనూ పోటీ నెలకొంది. 

ఇటీవల గ్లింప్స్ ల విషయంలోనూ పోటీ వచ్చింది. ఇప్పుడు పాటల విషయంలోనూ పోటీ వస్తుంది. రామ్‌ చరణ్‌ నటిస్తున్న `గేమ్‌ ఛేంజర్‌` నుంచిమొదటి పాట వచ్చింది. `జరగండి జరగండి` పాట పాన్‌ ఇండియా లాంగ్వేజెస్‌లో విడుదలైంది. 24 గంటల్లో 5.5 మిలియన్స్ వ్యూస్‌ మాత్రమే సాధించింది. ఆ తర్వాత అల్లు అర్జున్‌ నటించిన `పుష్ప2` నుంచి ఫస్ట్ సాంగ్ వచ్చింది. `పుష్ప పుష్ప` అంటూ సాగే పాట విడుదలైంది. ఇది దుమ్ములేపింది. 24 గంటల్లో ఏకంగా 26.5 మిలియన్స్ వ్యూస్‌ని సాధించింది. `గేమ్‌ ఛేంజర్‌` కంటే ఐదు రెట్లు ఎక్కువగా పుష్ప సాంగ్‌కి వచ్చింది. 

దీంతో ఇప్పుడు `దేవర` సైతం ఆ కాంపిటీషన్‌ని ఫేస్‌ చేయక తప్పడం లేదు. ఈ మూవీ నుంచి ఈ రోజు సాయంత్రం రాబోతున్న `ఫీయర్‌` సాంగ్‌ `పుష్ప` పాటని బీట్‌ చేస్తుందా? అనేది సస్పెన్స్ నెలకొంది. టార్గెట్‌ రీచ్‌ కావాలని, దాన్ని కొట్టేయాలని ఎన్టీఆర్‌ ఫ్యాన్స్ కాచుకుని కూర్చున్నారు. 24 గంటల్లో `పుష్ప`ని దాటేస్తే వాళ్లంతా కూల్‌గా ఉంటారు. లేదంటే సోషల్‌ మీడియాలో కంపారిజన్‌ తప్పదు, ట్రోల్‌ తప్పదు. మరి అనిరుథ్‌ ఏం చేస్తాడో చూడాలి. 

కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్‌ నటిస్తున్న `దేవర` చిత్రంలో జాన్వీ కపూర్‌ హీరోయిన్‌గా నటిస్తుంది. సైఫ్‌ అలీ ఖాన్‌ విలన్‌ పాత్రలో కనిపిస్తారు. ఇందులో తారక్‌ ద్విపాత్రాభినయం చేయబోతున్నారట. తండ్రీ కొడుకులుగా కనిపిస్తారని సమాచారం. ఈ మూవీని కళ్యాణ్‌ రామ్‌, సుధాకర్‌ మిక్కిలినేని నిర్మిస్తున్నారు. దీన్ని దసరా కానుకగా అక్టోబర్‌ 10న విడుదల చేయబోతున్నారు.  
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios