టాలీవుడ్ లో కమర్షియల్ గా సక్సెస్ కాలేకపోయినా ఓ వర్గం ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్న చిత్రం ప్రస్థానం. దర్శకుడిగా దేవకట్టకు ఆ సినిమా మంచి గుర్తింపు తెచ్చింది. అపజయాలు ఎన్ని ఎదురైనా అదే కథ బాలీవుడ్ లో అవకాశాన్ని వచ్చేలా చేసింది. సంజయ్ దత్ ప్రధాన పాత్రలో ప్రస్తుతం బాలీవుడ్ ప్రస్థానం షూటింగ్ శరవేగంగా సాగుతోంది. 

అయితే సినిమా రిలీజ్ డేట్ ను (సెప్టెంబర్ 20) చిత్ర యూనిట్ ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక ట్రైలర్ ను ఆగస్ట్ 28న రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నారు. అయితే సినిమా షూటింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి సినిమాకు సంబందించిన ఏ విషయం కూడా నార్త్ ఆడియెన్స్ ని ఆకట్టుకోవడం లేదు. సంజయ్ గత సినిమాలతో పోలిస్తే ఈ సినిమాకు అనుకున్నంతగా గుర్తింపు రాలేదు. 

టీజర్ విడుదల చేసినా సంజయ్ స్థాయిని సినిమా పెంచలేకపోయింది. ఇక ఇప్పుడు ట్రైలర్ తో ఎలాగైనా ఆడియెన్స్ లో అంచనాలను రేపాలని చూస్తున్నారు. స్ట్రాంగ్ డైలాగ్స్ ఉండేలా సంజయ్ పాత్రనే కాకుండా ఇతర తారాగణం పాత్రల భావాన్ని కూడా ట్రైలర్ లో చూపించడానికి ప్రయత్నం చేస్తారట. ఓ విధంగా చిత్ర యూనిట్ కి పెద్ద అగ్ని పరీక్షే అని చెప్పాలి. సినిమాకు మంచి ఓపెనింగ్స్ దక్కాలంటే విలైనంత వరకు ట్రైలర్ తోనే క్రేజ్ పెంచాలి. మరి దర్శకుడు దేవాకట్టా ఏ విధంగా ప్రజెంట్ చేస్తాడో చూడాలి.