Asianet News TeluguAsianet News Telugu

దేవదాస్ ప్రీ రిలీజ్ బిజినెస్.. టార్గెట్ రూ.40 కోట్లు

ఇకపోతే సినిమా ప్రీ రిలీజ్ ఆసక్తిని రేపుతోంది. దేవ దాస్ వరల్డ్ వైడ్ త్రియేటికల్ వాల్యూ రూ.38 కోట్లు. నైజం ఏరియాల్లో అత్యధికంగా 11 కోట్ల వరకు ధర పలికిన ఈ సినిమా నెల్లూరు ఏరియాలో అతితక్కువ 1.25కోట్లకు అమ్ముడుపోయింది. 

devadas pre-release business
Author
Hyderabad, First Published Sep 26, 2018, 4:52 PM IST

నాగార్జున - నాని కథానాయకులుగా నటించిన మల్టీస్టారర్ చిత్రం దేవదాస్ రేపు వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతోంది. సినిమాపై ప్రస్తుతానికి పాజిటివ్ బజ్ గట్టిగానే క్రియేట్ అయ్యింది. ట్రైలర్ సాంగ్స్ కూడా ఓ వర్గం వారిని బాగానే ఆకట్టుకున్నాయి. ఇకపోతే సినిమా ప్రీ రిలీజ్ ఆసక్తిని రేపుతోంది. దేవ దాస్ వరల్డ్ వైడ్ త్రియేటికల్ వాల్యూ రూ.38 కోట్లు. 

నైజం ఏరియాల్లో అత్యధికంగా 11 కోట్ల వరకు ధర పలికిన ఈ సినిమా నెల్లూరు ఏరియాలో అతితక్కువ 1.25కోట్లకు అమ్ముడుపోయింది. ఓవర్సీస్ లో నాని సినిమాలకు మంచి బిజినెస్ ఉండడంతో అక్కడ 5 కోట్ల ధర పలికినట్లు తెలుస్తోంది. నైజం మరియు ఆంధ్రప్రదేశ్ లో మొత్తంగా కలిపి సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ 30.15 కోట్లు. ఓవర్సీస్ తో పాటు రెస్ట్ ఆఫ్ ఇండియా - కర్ణాటక తో కలిపి మొత్తంగా సినిమా వాల్యూ రూ.38 కోట్లని సమాచారం. 

అంటే ఇప్పుడు దేవ దాస్ దగ్గర ఉన్న ఫస్ట్ టార్గెట్ మినిమమ్ రూ.40 కోట్లు రాబట్టాలి. అప్పుడే బయ్యర్స్ సేఫ్ జోన్ లో పడతారు. మల్టి స్టారర్ కావడంతో ఓపెనింగ్స్ రోజు మంచి కలెక్షన్స్ అందే అవకాశాలు ఉన్నాయి. హిట్ టాక్ వచ్చింది అంటే ఫస్ట్ వీక్ లోనే సినిమా టార్గెట్ రీచ్ అవ్వగలదని తెలుస్తోంది. మరి సినిమా ఏ స్థాయిలో వసూళ్లను అందిస్తుందో చూడాలి. వైజయంతి బ్యానర్ లో.అశ్వినీదత్ సినిమాను నిర్మించారు. 

 

సినిమాను అడ్డుకునేంత ధైర్యం కౌశల్ ఆర్మీకి లేదు.. నాని కామెంట్స్!

నాగ్ లో ఉన్న చెడు లక్షణాల లిస్ట్.. నాని మాటల్లో!

దేవదాస్ వర్కింగ్ స్టిల్స్

దేవదాస్ హిట్టయితే మనోడి రేంజ్ మారినట్టే!

 

 

Follow Us:
Download App:
  • android
  • ios