Asianet News TeluguAsianet News Telugu

సినిమాను అడ్డుకునేంత ధైర్యం కౌశల్ ఆర్మీకి లేదు.. నాని కామెంట్స్!

అప్పటివరకు ఎలాంటి నెగెటివిటీ లేని హీరో నానిపై బిగ్ బాస్ షో విపరీతమైన నెగెటివిటీ వచ్చేలా చేసింది. ముఖ్యంగా కౌశల్ ఆర్మీ నానిని టార్గెట్ చేస్తూ అతడు పక్షపాతం చూపిస్తున్నాడని ఆరోపణలు చేసింది. 

hero nani comments on bigg boss show
Author
Hyderabad, First Published Sep 26, 2018, 2:26 PM IST

అప్పటివరకు ఎలాంటి నెగెటివిటీ లేని హీరో నానిపై బిగ్ బాస్ షో విపరీతమైన నెగెటివిటీ వచ్చేలా చేసింది. ముఖ్యంగా కౌశల్ ఆర్మీ నానిని టార్గెట్ చేస్తూ అతడు పక్షపాతం చూపిస్తున్నాడని ఆరోపణలు చేసింది.

కౌశల్ ని నాని ప్రశ్నించిన ప్రతిసారి సోషల్ మీడియాలో ట్రోల్ చేశారు. నాని నటించిన 'దేవదాస్' సినిమా ఆడనివ్వమని ఇలా రకరకాల స్టేట్మెంట్స్ ఇచ్చారు. దీనిపై స్పందించిన నాని.. ''సినిమాను అడ్డుకునేంత ధైర్యం కౌశల్ ఆర్మీకి లేదు.. ఎలాంటి అడ్డంకులు లేకుండా 'దేవదాస్' సినిమా విడుదలవుతుంది. అయినా సినిమా కోసం చాలా మంది కష్టపడతారు. ఒక్కరి కోసం అంత మందిని ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు.

అయినా కౌశల్ ఆర్మీ నా సినిమాపై పగ పట్టిందనే ప్రచారాన్ని మీరు నమ్ముతున్నారా..? నేనైతే నమ్మడం లేదు'' అంటూ బదులిచ్చాడు. ఇక బిగ్ బాస్ షో ముగింపు దశకు వచ్చింది కదా ఎలా ఫీల్ అవుతున్నారని ప్రశ్నించగా.. ''హమ్మయ్య అయిపోయిందా అనిపిస్తుంది. ఈ మూడు నెలలు చాలా ఒత్తిడిగా గడిచాయి. ఓ పక్క సినిమాలు, మరొపక్క బిగ్ బాస్ షో. వారానికి ఒక్క రోజే కదా అని కమిట్ అయ్యాను.

కానీ వారం రోజుల పాటు ఫాలో అవ్వాల్సివస్తోంది. ఏడాదికి మూడు సినిమాలు చేసినా.. షెడ్యూల్ కి మధ్యలో పది రోజులు బ్రేక్ వచ్చేది. కానీ మూడు నెలల నుండి ఒక్క పూట కూడా ఖాళీగా లేను. ఇక బిగ్ బాస్ షో నాలో చాలా మార్పు తీసుకొచ్చింది. ఇదివరకూ అందరూ మంచోళ్లే అనుకునేవాడిని. కానీ ఆ అభిప్రాయం మారింది. ఇంత కాంప్లికేటేడ్ గా ఉంటారా..? అని ఆశ్చర్యపోయాను. ఈ షో నా కళ్లు తెరిపించింది. ప్రపంచం నాకు పరిచయమైంది'' అంటూ చెప్పుకొచ్చాడు. 

Follow Us:
Download App:
  • android
  • ios