Asianet News TeluguAsianet News Telugu

మా నాన్న నన్ను పులిలా పెంచాడు.. షణ్ముఖ్‌కి వార్నింగ్‌ ఇస్తున్న దీప్తిసునైనా.. వీడియో వైరల్‌

 దీప్తి పంచుకుంటున్న వీడియోలు ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్‌ అవుతున్నాయి. గత ఐదేళ్లుగా యూట్యూబ్‌ స్టార్స్ దీప్తిసునైనా, షణ్ముఖ్‌ ప్రేమించుకుంటున్నారు. ఘాఢమైన ప్రేమలో మునిగితేలుతున్న ఈ జంట మధ్య బిగ్‌బాస్‌ చిచ్చు పెట్టింది. 

deepthi sunaina shared shocking posts like i am tiger is it warning to shanmukh ?
Author
Hyderabad, First Published Jan 7, 2022, 7:15 PM IST

బిగ్‌బాస్‌ ఫేమ్ షణ్ముఖ్‌(Shanmukh), దీప్తిసునైనా(Deepthi Sunaina) ఇటీవల విడిపోవడం సంచలనం సృష్టించగా, ఆ తర్వాత దీప్తిసునైనా పెట్టిన పోస్టులు హాట్‌ టాపిక్‌ అవుతున్నాయి. ఆమె తాజాగా తనని తాను పులిగా పోల్చుకుంటూ ఓ పోస్ట్ పెట్టింది. Deepthi పంచుకుంటున్న వీడియోలు ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్‌ అవుతున్నాయి. గత ఐదేళ్లుగా యూట్యూబ్‌ స్టార్స్ దీప్తిసునైనా, షణ్ముఖ్‌ ప్రేమించుకుంటున్నారు. ఘాఢమైన ప్రేమలో మునిగితేలుతున్న ఈ జంట మధ్య బిగ్‌బాస్‌ చిచ్చు పెట్టింది. బిగ్‌బాస్‌ చాలా వరకు కంటెస్టెంట్లకి హెల్ప్ అవుతుంది. పాపులారిటీతోపాటు అవకాశాలను తీసుకొస్తుంది. 

అయితే షణ్ముఖ్‌ విషయంలో అది రివర్స్ అయ్యింది. ఉన్న పాపులారిటీ పోవడమే కాదు, ఆయనకు కొత్త తలనొప్పులు తెచ్చింది. అంతేకాదు ఉన్న ప్రేమ కూడా పోయేలా చేసింది. బిగ్‌బాస్‌5లో షణ్ముఖ్‌ కంటెస్టెంట్‌గా పాల్గొని రన్నర్‌గా నిలిచాడు. హౌజ్‌లో ఉన్నన్ని రోజులు ఆయన ప్రియురాలు దీప్తిసునైనా .. షన్నుకి సపోర్ట్ చేసింది. ఏకంగా హౌజ్‌లోకి కూడా వచ్చి ఆకట్టుకుంది. షన్ను గెలుపుని కోరుకుంది. చివరి వరకు షన్ను కోసం నిలబడ్డా దీప్తి.. ఆయన బిగ్‌బాస్‌ హౌజ్‌ నుంచి బయటకు వచ్చాక మాత్రం పెద్ద షాక్‌ ఇచ్చింది. వీరిద్దరి మధ్య ఏం జరిగిందో ఏమో, లేక బిగ్‌బాస్‌లో సిరి, షన్ను మధ్య సన్నివేశాలను చూసి హర్ట్ అయ్యిందో ఏమో దీప్తి హార్ట్ బ్రేక్‌ అయ్యే నిర్ణయం తీసుకుంది. షణ్ముఖ్‌ తాను విడిపోతున్నట్టు వెల్లడించింది. 

అయితే ఇప్పుడు షణ్ముఖ్‌తో విడిపోయిన తర్వాత ఆ బాధ నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తుంది. అందుకోసం వరుసగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియోలు, పోస్టులు పెడుతూ ఆ విషయాన్ని తెలియజేస్తుంది. పరోక్షంగా,ప్రత్యక్షంగా దీప్తి పెడుతున్న పోస్ట్ లు ఆమె ఎంతగా బాధపడుతుందో అనే విషయాన్ని వెల్లడిస్తున్నాయి. ఈక్రమంలో దీప్తి ఓ సంచలన పోస్ట్ పెట్టింది. ఓ రకంగా షన్నుకి వార్నింగ్‌ ఇస్తుందనిపించేలా ఉంది. 

ప్రియుడి ప్రేమ కంటే తండ్రి ప్రేమ గొప్పదని చెబుతుంది దీప్తి. ఈ మేరకు ఆమె తన తండ్రితో ఉన్న ఓ వీడియోని షేర్‌ చేసుకుంటూ ఆసక్తికర పోస్ట్ పెట్టింది. `ఆమె ఒంటరి కాదు, ఆమె వెనుక అత్యంత పవర్‌ఫుల్‌ శక్తి ఉంది. అతడే తండ్రి ప్రేమ` అంటూ వీడియోని షేర్‌ చేసుకుంది. తన తండ్రితో కలిసి సరదాగా ఉన్న వీడియోని పంచుకుంది దీప్తి. దీంతోపాటు మరో పోస్ట్ లో `నేను పులిని. మా నాన్న నన్ను అలా పెంచాడు` అని తెలిపింది దీప్తి. ప్రస్తుతం ఈ వీడియోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. 

దీంతోపాటో ఇన్‌స్టా స్టోరీస్‌లో `నేను గతాన్ని చూశాను. కానీ దాన్ని అంగీకరించలేను. దాన్నుంచి నేను మనస్తాపం చెందడం లేదు. దాని గురించి కామెంట్‌ చేయను. వాళ్ల మైండ్‌ మారాలని నేను కోరుకోవడం లేదు. పర్సన్‌గా నేను ఇష్టపడతాను. ఆ జ్ఞాపకాలతో రోజు గడిచిపోతుంది. వాట్‌ ఏ కాన్సెప్ట్` అంటూ లవ్‌ సింబల్‌ పెట్టింది దీప్తి. మరి ఈ పోస్ట్ వెనకాల ఆమె అర్థం ఏంటి? ఇది షణ్ముఖ్‌ని ఉద్దేశించే పెట్టినట్టుగా ఉందని అంటున్నారు నెటిజన్లు. మొత్తాన్ని షణ్ముఖ్‌ని మర్చిపోలేకపోతున్నట్టు తెలుస్తుంది దీప్తి పోస్టులు చూస్తుంటే. 

Follow Us:
Download App:
  • android
  • ios