Asianet News TeluguAsianet News Telugu

బ్యాడ్మింటన్‌ టీంతో దీపిక.. వైరల్‌ అవుతున్న పాత ఫోటోలు

తన ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో తన ట్రిప్‌కు సంబంధించిన ఫోటోలను షేర్‌ చేసింది దీపిక. ఆ ఫోటోల్లో దీపిక చాలా సైలెంట్‌గా వెనక సీట్లో కూర్చొని ఉంది. మరో ఫోటోలో ట్రైన్లో అప్పర్‌ బెర్త్‌లో కూర్చొని ఉంది దీపిక. ఫోటోలతో పాటు `వాళ్లు ముందుకు చూడమంటున్నారు. కానీ నీకు ఎప్పుడు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో గుర్తు ఉండాలి.

Deepika Padukone shares pictures of train traveling with her badminton team
Author
Hyderabad, First Published Jul 10, 2020, 4:23 PM IST

బాలీవుడ్‌ లో నెంబర్ వన్ హీరోయిన్‌గా వెలుగొందుతున్న దీపిక సినిమాల్లోకి, మోడలింగ్ రంగంలోకి రాకముందు బ్యాడ్మింటన్‌ చాంపియన్‌ అన్న విసయం తెలిసిందే. దీంతో మ్యాచ్‌ల కోసం ఆమె తరుచూ వివిధ రాష్ట్రాలకు ట్రావెల్‌ చేస్తూ ఉండేది. ప్రస్తుతం లాక్‌ డౌన్ కారణంగా ఇంట్లోనే ఉంటున్న దీపికా పదుకొని తన పాత జ్ఞాపకాలను నేమరు వేసుకుంటుంది. ఈ సందర్భంగా తాను బ్యాడ్మింటన్‌ టీంతో కలిసి ప్రయాణంచేస్తున్నప్పుడు తీసుకున్న ఫోటోలను అభిమానులతో షేర్  చేసుకుంది.

తన ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో తన ట్రిప్‌కు సంబంధించిన ఫోటోలను షేర్‌ చేసింది దీపిక. ఆ ఫోటోల్లో దీపిక చాలా సైలెంట్‌గా వెనక సీట్లో కూర్చొని ఉంది. మరో ఫోటోలో ట్రైన్లో అప్పర్‌ బెర్త్‌లో కూర్చొని ఉంది దీపిక. ఫోటోలతో పాటు `వాళ్లు ముందుకు చూడమంటున్నారు. కానీ నీకు ఎప్పుడు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో గుర్తు ఉండాలి. ఇది ఓ అద్భుతమైన ప్రయాణం` అంటూ కామెంట్ చేసింది.

దీపిక పదుకొని ప్రస్తుతం ఇండియాలోనే బిగ్గెస్ట్ యాక్ట్రస్‌. తన నటనతో పాటు ఇతర సేవా కార్యక్రమాలతో ఎంతో మందిని ఇన్‌ఫ్ల్యూయన్స్ చేస్తోంది ఈ బ్యూటీ. నటి ఎంత ఎదిగిన తాను ఎక్కడి నుంచి వచ్చిందో ఎప్పుడూ మర్చిపోలేదు దీపిక,  అందుకే తరుచూ తన పాత ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తుంటుంది. ఇటీవల చప్పాక్‌ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి దీపిక త్వరలో షకున్‌ బాత్రా సినిమాలో హీరోయిన్‌గా నటించేందుకు రెడీ అవుతోంది.

Follow Us:
Download App:
  • android
  • ios