Asianet News TeluguAsianet News Telugu

#Kalki2898AD: దీపిక కు షాకింగ్ రెమ్యునరేషన్ ?

హీరోయిన్‌గా దీపికా లాస్ట్ ఫిల్మ్ ‘పఠాన్’. అది బ్లాక్‌బస్టర్ హిట్  అవటంతో  రికార్డ్ స్థాయి కలెక్షన్స్‌ను వచ్చాయి. 

Deepika Padukone remuneration for Kalki 2898 AD jsp
Author
First Published Jun 19, 2024, 12:38 PM IST


  ప్రభాస్ (Prabhas) నాగ్ అశ్విన్ (Nag Ashwin) కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం  కల్కి 2898 ఏడీ . ఈ చిత్రాన్ని సైన్స్​కు మైథాలజీని జోడించి నాగ అశ్విన్ తెరకెక్కించారు. ఆరు వేల సంవత్సరాల మధ్య జరిగే కథతో ఇది సాగుతుంది. వైజయంతీ మూవీస్‌ బ్యానర్​పై నిర్మాత అశ్వినీ దత్​ నిర్మించారు. మహానటి ఫేమ్ నాగ్​ అశ్విన్ డైరెక్ట్ చేశారు. బాలీవుడ్ బిగ్​ బీ అమితాబ్ బచ్చన్, యూనివర్సల్ స్టార్​ కమల్​ హాసన్​, బోల్డ్ బ్యూటీస్​ దిశా పటానీ, దీపికా పదుకొణె కీలక పాత్రల్లో నటించారు.

ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతున్న ఈ   సినిమాపై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమా రిలీజ్ టైమ్ దగ్గరవుతున్న నేపధ్యంలో సినిమా గురించిన విశేషాలు బయిటకు వస్తున్నాయి. మరీ ముఖ్యంగా  ఈ సినిమాలో దీపిక పదుకొణె పాత్ర గురించి అందరూ మాట్లాడుతున్నారు. ఈ సినిమాలో దీపిక కీలకమైన పాత్ర లో కనిపించనున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమా నిమిత్తం దీపిక ఎంత వసూలు చేసారనే విషయం బయిటకు వచ్చింది.

ముంబై సినీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమా నిమిత్తం దీపిక కు 15 కోట్లు దాకా పే చేసారు. సాధారణంగా దీపికా పదుకొనె ఒక్క సినిమా కోసం రూ.15 నుండి 30 కోట్ల రెమ్యునరేషన్‌ను డిమాండ్ చేస్తుంది. ఇక ‘కల్కి 2898 AD’ కోసం తను రూ.20 కోట్లకు పైగానే అడిగిందని సమాచారం. హీరోయిన్‌గా దీపికా లాస్ట్ ఫిల్మ్ ‘పఠాన్’. అది బ్లాక్‌బస్టర్ హిట్  అవటంతో  రికార్డ్ స్థాయి కలెక్షన్స్‌ను వచ్చాయి. 

అలాగే  ఆ తర్వాత షారుఖ్ ఖాన్ హీరోగా నటించిన ‘జవాన్’లో ఒక గెస్ట్ రోల్‌లో కనిపించింది. స్క్రీన్‌పై దీపికా కనిపించింది కాసేపే అయినా అందులో హీరోయిన్ నయనతారకు ఎంత గుర్తింపు లభించిందో దీపికాకు కూడా అంతే ప్రశంసలు అందాయి.  ఈ క్రమంలో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ పడడంతో దీపికా.. ఈ రేంజ్‌లో రెమ్యునరేషన్ డిమాండ్ చేసి తీసుకున్నట్లు  తెలుస్తోంది.

అమెరికాలో ‘కల్కి 2898 AD’పై క్రేజ్ మరింత పెరిగిపోయింది. అందుకే ప్రీ బుకింగ్స్ అనేవి ఓ రేంజ్‌లో జరుగుతున్నాయి. నార్త్ అమెరికాలో 1.6 మిలియన్ డాలర్ల ప్రీ బుకింగ్ బిజినెస్ చేసిందని మేకర్స్ ప్రకటించారు. ఒక ఇండియన్ సినిమా.. ప్రీ బుకింగ్ విషయంలో ఇంత వేగంగా 1 మిలియన్ మార్క్‌ను టచ్ చేయడం ఇదే మొదటిసారి అని అన్నారు. 
  
నాగ్ అశ్విన్ రీసెంట్ ఓ మీడియా ఇంటరాక్షన్ చెప్పినదాని ప్రకారం ఈ చిత్రం మహాభారత కాలంలో మొదలై 2898 లో ముగుస్తుంది. అందుకే ఈ చిత్రానికి ‘Kalki 2898 AD’అని పెట్టామని చెప్పారు.  అలాగే  మేము ఇక్కడ  మన వరల్డ్ ని క్రియేట్ చేయటానికి  ప్రయత్నిస్తున్నాము. పూర్తి భారతీయతను ఈ సినిమాలో అందిస్తాము. 

ముఖ్యంగా  ఈ సినిమాని బ్లేడ్ రన్నర్ (హాలీవుడ్ సైన్స్ ఫిక్షన్ చిత్రం) లాగా చేయకూడదనేది మా ముందు ఉన్న ఛాలెంజ్. క్రీ.శ. 2898 నుండి మనం 6000 సంవత్సరాల వెనక్కి వెళితే, మనం క్రీ.పూ. 3102కి చేరుకుంటాం, అంటే కృష్ణుడి చివరి అవతారం గడిచిపోయినట్లే అని క్లారిటీ ఇచ్చారు నాగ్ అశ్విన్.  ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు.  

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios