దీపికా పదుకొనె పాత్ర నెగటివ్‌ షేడ్స్ లో ఉంటుందట. విలన్‌కి కూతురుగా దీపికా పదుకొనె కనిపించబోతుందని, యుద్ధం చేస్తుందని ఫిల్మ్ నగర్‌ టాక్‌. 

దీపికా పదుకొనే పాన్‌ ఇండియా సినిమాల ట్రెండ్‌ని ఫాలో అవుతుంది. ఆమె కూడా భారీ చిత్రాల్లో భాగమవుతుంది. ఇప్పటికే పలు భారీ చిత్రాల్లో నటిస్తుంది. మరికొన్ని కొత్తగా పాన్‌ ఇండియాలకు కమిట్‌ అవుతుందట ఈ గ్లోబల్ బ్యూటీ. అయితే దీపికా విలన్‌గా కనిపించబోతుందనే వార్త ఆసక్తికరంగా మారింది. అది కూడా పాన్‌ ఇండియా మూవీలో, స్టార్‌ హీరో సినిమాలో విలన్‌ పాత్ర కావడం విశేషం. 

`జై భీమ్‌`, `ఆకాశమే నీ హద్దురా`, `విక్రమ్‌` సినిమాలో వరుస విజయాలను అందుకున్న సూర్య. ప్రస్తుతం ఆయన అత్యంత క్రేజీ హీరోగా మారారు. కోలీవుడ్‌ టాప్ హీరోల లీగ్‌లోకి చేరిపోయారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం `కంగువ` అనే భారీ సినిమా చేస్తున్నారు. పీరియాడికల్‌ నేపథ్యంలో రూపొందుతున్న యాక్షన్‌ డ్రామా ఇది. 14వ సెంచరీ నేపథ్యంలో సాగుతుందట. ఇందులో సూర్య అడవి జాతి ప్రజల నాయకుడిగా కనిపిస్తాడు. ఇటీవల విడుదల చేసిన ఫస్ట్ గ్లింప్స్ గూస్‌బంప్స్ తెప్పించేలా ఉంది. సూర్య పాత్ర భయంకరంగా ఉండటం విశేషం. 

శివ అండ్‌ టీమ్‌ రూపొందిస్తున్న చిత్రమిది. స్టూడియో గ్రీన్స్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమా శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. ఇది రెండు భాగాలుగా రూపొందుతుందట. దాదాపు రూ.250కోట్లతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు నిర్మాత జ్ఞానవేల్‌ రాజా. ఇందులో దిశా పటానీ కథానాయికగా నటిస్తుండగా, దీపికా పదుకొనెని మరో పాత్ర కోసం ఎంపిక చేయబోతున్నారని సమాచారం. అందుకోసం ఇప్పటికే ఆమెని సంప్రదించినట్టు టాక్‌. 

అయితే ఇందులో దీపికా పదుకొనె పాత్ర నెగటివ్‌ షేడ్స్ లో ఉంటుందట. విలన్‌కి కూతురుగా దీపికా పదుకొనె కనిపించబోతుందని, యుద్ధం చేస్తుందని ఫిల్మ్ నగర్‌ టాక్‌. మరి ఈ చిత్రానికి దీపికా ఒప్పుకుంటుందా? అసలు ఇది వర్కౌట్‌ అవుతుందా? అనేది ఆసక్తికరంగా ఉంది. ఒకవేళ దీపికా ఈ సినిమా చేస్తే నెక్ట్స్ లెవల్‌లో ఉండబోతుందని టాక్‌. హీరోయిన్‌గా, యాక్షన్‌ సీక్వెన్స్ లతో ఆకట్టుకుంటున్న దీపికా నెగటివ్‌ రోల్‌ చేస్తే రచ్చ రచ్చ అవుతుందని చెప్పొచ్చు. మొదటి పార్ట్ `కంగువ`ని వచ్చే ఏడాది ఏప్రిల్‌లో విడుదల చేయబోతున్నారని టాక్‌.

ఇదిలా ఉంటే ఈ పొడుగుకాళ్ల బ్యూటీ ఇప్పటికే తెలుగులోకి ఎంట్రీ ఇస్తూ `ప్రాజెక్ట్ కే`(కల్కి2898ఏడీ) చిత్రంలో నటిస్తుంది. ప్రభాస్‌కి జోడీగా చేస్తుంది. ఇందులోనూ దిశా పటానీ మరో హీరోయిన్‌. అమితాబ్ బచ్చన్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. కమల్‌ హాసన్‌ నెగటివ్‌ రోల్ చేస్తున్నట్టు సమాచారం. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి రానుంది. కానీ వాయిదా పడే అవకాశాలు కనిపిస్తుంది. సమ్మర్‌కి షిఫ్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. దీంతోపాటు `జవాన్‌`(స్పెషల్‌ అప్పీయరెన్స్), `ఫైటర్‌ చిత్రంలో నటిస్తుంది దీపికా.