Asianet News TeluguAsianet News Telugu

ప్రభాస్ 21: దీపికకి ఎంత ఇస్తున్నారంటే!

బాలీవుడ్  స్టార్ హీరోయిన్ దీపికా ప‌దుకొనె ఈ సినిమాలో ప్ర‌భాస్‌తో క‌లిసి న‌టించ‌నుంది. దీపిక‌కు తెలుగులో ఇదే తొలి సినిమా కావ‌డం విశేషం.  ప్ర‌భాస్ సినిమాలో న‌టించేందుకు దీపిక‌ను ఒప్పించ‌డం కోసం నాగ్ అశ్విన్ టీమ్ బాగానే ఖ‌ర్చు పెట్టిన‌ట్లు తెలుస్తోంది. అలాగే ఈ సినిమా నిమిత్తం దీపికకు బాగానే ముట్టచెప్తున్నారని వినపడుతోంది. అయితే ఆ మొత్తం ఎంత అనేది ...బాలీవుడ్ వర్గాల ద్వారా బయిటకు వచ్చింది.

Deepika Padukone get 25 cr for Prabhas movie
Author
Hyderabad, First Published Jul 20, 2020, 12:53 PM IST

'మ‌హాన‌టి' ఫేం  నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందనున్న  ప్ర‌భాస్ 21వ సినిమా లేటెస్ట్ అప్‌డేట్ అభిమానుల‌ను ఎగిరి గంతేసేలా చేస్తున్న సంగతి తెలిసిందే.  బాలీవుడ్  స్టార్ హీరోయిన్ దీపికా ప‌దుకొనె ఈ సినిమాలో ప్ర‌భాస్‌తో క‌లిసి న‌టించ‌నుంది. దీపిక‌కు తెలుగులో ఇదే తొలి సినిమా కావ‌డం విశేషం.  ప్ర‌భాస్ సినిమాలో న‌టించేందుకు దీపిక‌ను ఒప్పించ‌డం కోసం నాగ్ అశ్విన్ టీమ్ బాగానే ఖ‌ర్చు పెట్టిన‌ట్లు తెలుస్తోంది. అలాగే ఈ సినిమా నిమిత్తం దీపికకు బాగానే ముట్టచెప్తున్నారని వినపడుతోంది. అయితే ఆ మొత్తం ఎంత అనేది ...బాలీవుడ్ వర్గాల ద్వారా బయిటకు వచ్చింది.

ఈ సినిమా నిమిత్తం దీపిక రెమ్యూనిరేషన్ 25 కోట్లు వసూలు చేస్తోందిట. అలాగే ...అదే సమయంలో ఈ సొమ్ముకు... జీఎస్టీ కూడా నిర్మాతే భరించాలి. అంటే దాదాపు ముఫై కోట్లు అని తెలుస్తోంది. మరి దీపికను పెట్టుకోవటం వలన ఆ మొత్తం రికవరీ ఉంటుందా అంటే...ఖచ్చితంగా ఉంటుందని చెప్తున్నారు. అశ్వనీదత్ లాంటి నిర్మాత ...అవన్నీ లెక్కేసుకోకుండా ముందుకు దూకడు అంటున్నారు. కాకపోతే దీపిక నెక్ట్స్ జనరేషన్ బాలీవుడ్ లో వచ్చేసింది. బాలీవుడ్ లో ఎలాగో ప్రభాస్ కు మంచి మార్కెట్ ఉందని మొన్న సాహో తో ప్రూవ్ అయ్యింది. ఇక్కడ ఆడకపోయినా అక్కడ బాగా ఆడింది. ఇప్పుడు దీపిక కూడా జత అవుతుంది కాబట్టి హిందీ వెర్షన్ ఓ రేంజిలో బిజినెస్ చేస్తుందని చెప్తున్నారు. 
 
దీనిపై నాగ్ అశ్విన్ ఏమంటున్నారంటే... "రాజుకు స‌రిప‌డే రాణి కావాలి క‌దా మ‌రి.. చాలా ఆలోచించి తీసుకున్న నిర్ణ‌యమిది. ఇక పిచ్చెక్కిచ్చేద్దాం" అంటూ ట్వీట్ చేశారు. . దాదాపు రూ.400 కోట్లతో పాన్ వరల్డ్ మూవీగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ భారీ బడ్జెట్‌ చిత్రంలో కీలకపాత్రలు పోషించే నటీనటులను జాగ్రత్తగా ఎంపిక చేస్తోంది చిత్రబృందం. సైన్స్‌ ఫిక్షన్‌ కథాంశంతో సాగే ఈ సినిమాలో విలనిజాన్ని చాలా కొత్తగా చూపించాలని దర్శకుడు భావిస్తున్నారట. 

ప్రభాస్‌తో పోటీగా సాగే విలన్‌ పాత్ర కోసం ఒక​ప్పటి హీరో.. రీఎంట్రీ విలన్‌ అరవింద్‌ స్వామి అయితే బాగుంటుందని నాగ్‌ అశ్విన్‌ అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే ఆయనతో దర్శకుడు సంప్రదింపులు జరిపినట్లు ఫిలింనగర్‌ వర్గాల టాక్‌. ఇక ఈ సినిమా అనీ అనుకున్నట్లు జరిగితే ఈ ఏడాది చివర్లో లేక వచ్చే ఏడాది ఆరంభంలో పట్టాలెక్కే అవకాశం ఉంది. వైజయంతి మూవీస్‌ పతాకంపై అశ్వినీదత్‌ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios