Asianet News TeluguAsianet News Telugu

షారుఖ్ తో చేయనంటోంది.. ఫస్ట్ టైమ్ అతనితోనే చేసిందిగా

  • షారుఖ్ సినిమాలో దీపికా పడుకొనేకు హీరోయిన్ ఆఫర్ట
  • ఓం శాంతి ఓం తో షారుఖ్ సరసన డెబ్యూ ఇచ్చిన దీపిక
  • తాజాగా పద్మావతి సినిమా కారణంగా షారుఖ్ కు డేట్స్ లేవన్న దీపిక
deepika padukone decines offer with shah rukh khan

బాలీవుడ్‌ బాద్‌షా షారుక్‌ ఖాన్‌ సరసన నటించే ఛాన్స్‌ వస్తే ఎవరైనా ఎగిరి గంతేస్తారు... కానీ షారుఖ్ ను ఓ భామ కాదంటోందిప్పుడు. అది కూడా ఎవరో చెప్తే మీరే షాక్ అవుతారు. అవును మరి. డెబ్యూ కోసం అవకాశమిచ్చిన షారుఖ్ ఇప్పుడు ఆ హీరోయిన్ తో నో చెప్పించుకోవడం ఏమన్నా బావుందా.. కానీ షారుఖ్ కు తప్పలేదు. ఇప్పుడు ఈ భామ షారుఖ్ కు నో చెప్పడమేంటని బాలీవుడ్ అంతా ముక్కున వేలేసుకుంటోంది.

 

ఇంతకీ షారుక్‌ సినిమాకి నో చెప్పింది మరెవరో కాదు... సాక్షాత్తూ దీపికా పదుకొనె. షారుక్‌ నటించిన ‘ఓం శాంతి ఓం’ ద్వారా దీపిక బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ఆమె కెరీర్‌ పుంజుకోవడం, ప్రస్తుతం టాప్‌ హీరోయిన్స్‌లో ఒకరిలా దూసుకెళ్లడం జరిగాయి. అందుకే షారుక్‌ అంటే దీపికాకు ప్రత్యేకమైన అభిమానం ఉంది. అయినప్పటికీ ఆయన తాజా చిత్రంలో నటించడానికి అంగీకరించలేదట.



ఆనంద్‌ ఎల్‌. రాయ్‌ దర్శకత్వంలో షారుక్‌ ఖాన్‌ హీరోగా ఓ చిత్రం రూపొందనుంది. ఈ చిత్రంలో ఇద్దరు హీరోయిన్లకు ఛాన్స్‌ ఉందట. కత్రినా కైఫ్, దీపికా పదుకొనే పేర్లను చిత్రబృందం పరిశీలనలోకి తీసుకుని, వారిని సంప్రదించగా దీపికా పదుకొనే యాక్ట్‌ చేసేందుకు ఒప్పుకోలేదట. దానికి కారణం సంజయ్‌ లీలా బన్సాలీ దర్శకత్వంలో ఆమె చేస్తోన్న తాజా చిత్రం ‘పద్మావతి’. కొన్ని వివాదాల కారణంగా ఈ చిత్రం షూటింగ్‌ వాయిదా పడిన విషయం తెలిసిందే. దీంతో ముందు అనుకున్న డేట్స్‌ కన్నా ఎక్కువగానే దీపికా కేటాయించాల్సి వస్తోందట.



అందుకే షారుక్‌ మూవీకి డేట్స్‌ అడ్జెస్ట్‌ చేయడం కుదర్లేదని సమాచారం. ఇలా జరిగినందుకు దీపికా కూడా బాధపడుతున్నారట. ‘పద్మావతి’ చిత్రాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ముందుగా అనుకున్నట్లు ఈ ఏడాది నవంబర్‌ 17నే విడుదల చేయాలని దర్శకుడు బన్సాలీ స్ట్రాంగ్‌గా ఫిక్సయ్యారట. అందుకే ఒక్క దీపికా మాత్రమే కాదు.. ఈ చిత్రంలోని స్టార్లందరూ ఇతర సినిమాలకు ‘నో’ చెప్తున్నారట.

Follow Us:
Download App:
  • android
  • ios