'సాహో' తరువాత ప్రభాస్ 'జిల్' ఫేం రాధాకృష్ణ దర్శకత్వంలోపీరియాడికల్ లవ్ స్టోరీ చేస్తోన్న సంగతి తెలిసిందే.  యువీ క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ కరోనా తో బ్రేక్ ఇచ్చారు. ఈ చిత్రం తరువాత ప్రభాస్ మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతీ మూవీస్ బ్యానర్ లో సోషియో ఫాంటసీ మూవీ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ చిత్రానికి సంబంధించి సంబందించి అధికారిక ప్రకటన కూడా విడుదలైంది. 

ఈ చిత్రంలో ప్రభాస్ సరసన దేశం గుర్తింపు గలిగిన హీరోయిన్‌ను తీసుకోవాలనే ఆలోచనలో దర్శకుడు నాగ్ అశ్విన్ ఉన్నారు.ఈ నేపధ్యంలో అలియా భట్ ను సంప్రదించగా.. యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ సరసన నటించాలని ఉన్నా.. ఆర్ఆర్ఆర్ సినిమాతో పాటు 'బ్రహ్మాస్త్ర' వంటి భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నందున అలియా భట్ నో చెప్పిందిట. ఆ తరువాత  దీపికా పడుకొనే ను సంప్రదించగా ఆమె కొన్ని కండీషన్స్ తో ఓకే చెప్పిందిట. ప్రభాస్ సరసన ప్యాన్ ఇండియా మూవీ కాబట్టి ఈ సినిమా చేయడానికి ఓకే అందిట. అయితే, ఈ చిత్రంలో నటించేందుకు దీపిక చెప్పిన కండిషన్స్ చూసి నిర్మాతలు షాక్ అయ్యారట. 

అవేమిటంటే.. ప్రభాస్ తో నటించేందుకు ఎటువంటి అభ్యంతరం లేదు. కానీ.. ఈ చిత్రం బాలీవుడ్(హిందీ) థియేట్రికల్ రైట్స్ ఇవ్వమని కోరినట్టు సమాచారం. ప్రభాస్ చేసిన 'సాహు' సినిమా కి నెగటివ్ టాక్ వచ్చినా...నార్త్ ఇండియాలో బాగా ఆడింది. అలాంటి నార్త్ ఇండియా రైట్స్ ఇచ్చేస్తే ..ఇంక మిగిలేదముంటుంది.  దాంతో నిర్మాతలు ఆలోచనలో పడ్డారట. ఈ చిత్రాన్ని ఈ ఏడాది అక్టోబర్ లో సెట్స్ పైకి వెళ్లనుందని సమాచారం. సినిమా అనౌన్స్ చేసినప్పుడు నాగ్ అశ్విన్ మాట్లాడుతూ.. ఇది కేవలం పాన్ ఇండియా సినిమా కాదని, పాన్ వరల్డ్ సినిమా అని పేర్కోన్నాడు.  ప్రస్తుతం దీపిక రణ్‌వీర్ సింగ్ హీరోగా రూపొందుతున్న '83' చిత్రంలో హీరోయిన్ గా నటిస్తుంది.