బాలనటుడిగా 1990 కాలంలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు దిలీప్ కుమార్ సళ్వాడి. 30 సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసిన దిలీప్ 1993లో వచ్చిన నెంబర్ వన్ సినిమా ద్వారా వెండితెరకు పరిచయమయ్యాడు.
బాలనటుడిగా 1990 కాలంలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు దిలీప్ కుమార్ సళ్వాడి. 30 సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసిన దిలీప్ 1993లో వచ్చిన నెంబర్ వన్ సినిమా ద్వారా వెండితెరకు పరిచయమయ్యాడు. ధర్మ చక్రం - పోకిరి రాజా - స్నేహం కోసం అన్నమయ్య అలాగే తేజ దర్శకత్వంలో వచ్చిన జయం వరకు బాలనటుడిగా సత్తా చాటాడు.
అసలు విషయంలోకి వస్తే దిలీప్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 25 ఏళ్ళు పూర్తయింది. ఈ సిల్వర్ జూబ్లీ సందర్బంగా అతను హీరోగా పరిచయవ్వడానికి సిద్దమయ్యాడు. స్వీయ దర్శకత్వంలో చేసిన "దిక్సూచి" ను దిలీప్ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తేనున్నాడు. తానే హీరోగా నటించి దర్శకత్వం వహించిన ఈ సినిమాను ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారనే నమ్మకం ఉందని దిలీప్ అన్నాడు.
డివొషనల్ క్రైమ్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని శైలజ సముద్రాల, నరసింహ రాజు రాచూరి నిర్మిస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తయ్యింది. మిగతా పనులు కూడా త్వరలోనే ఫినిష్ అవుతాయని 1970 కాలంలో నడిచే ఈ దిక్సూచి కథ రొటీన్ కి బిన్నంగా ఉండబోతోందని అన్నారు. అదే విధంగా ఇలాంటి సినిమా ఇంతవరకు తెలుగులో రాలేదని మూడు జోనర్స్ మిక్సింగ్ గా రూపొందిన సినిమా అని దిలీప్ వివరణ ఇచ్చాడు.
