వెన్నెల, ప్రస్థానం లాంటి విభిన్న తరహా సినిమాలతో ఆకట్టుకున్న  దర్శకుడు దేవకట్టా.. అ తర్వాత ఆయన చేసిన ఆటోనగర్ సూర్య, డైనమైట్ సినిమాలు ఆశించిన స్థాయిలో వర్కవుట్ అవ్వలేదు. దాంతో గ్యాప్ తీసుకున్న దేవకట్టా ‘ప్రస్థానం’తో బాలీవుడ్ లో అడుగు పెట్టారు. ప్రస్తుతం అదే చిత్రాన్ని సంజయ్‌దత్‌తో హిందీలో రీమేక్‌ చేస్తున్నారు. ఆ తరవాత తెలుగులో ఓ సినిమా తెరకెక్కించడానికి ప్లాన్ చేస్తున్నారు.

మెగా హీరో సాయి ధరమ్ తేజ ఈ ప్రాజెక్టు కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. పూర్తి స్దాయి యాక్షన్ తో నడిచే  ఈ చిత్రానికి భగవాన్‌, పుల్లారావు నిర్మాతలుగా వ్యవహరిస్తారు. ప్రస్తుతం మారుతి తెరకెక్కిస్తున్న ‘ప్రతిరోజూ పండగే’లో నటిస్తున్నారు తేజు. ఈ సినిమా పూర్తయిన వెంటనే దేవ కట్టా సినిమా మొదలవుతుందని సమాచారం. . ప్రస్తుతం స్క్రిప్ట్ ని పూర్తి చేసే పనిలో ఉన్న దేవకట్టా త్వరలోనే ఈ కథకి సరిపొయీ నటీనటుల్ని ఎంచుకోనున్నాడు. త్వరలోనే పూర్తి వివరాలు అనౌన్స్ చేస్తాడు.

ప్రస్తుతం దేవకట్టా....బాహుబలి చిత్రం ప్రీక్వెల్‌ను  డైరెక్ట్‌ చేస్తున్నారు. శివగామి చిన్నతనం నుంచి సాగే కథని దీంట్లో చూపించనుండగా.. ఇందుకోసం మహిష్మతి సెట్‌తో పాటు మరికొన్ని సెట్స్‌ను నిర్మించి దానిలో చిత్రీకరించారు. అమిజాన్ ప్రైమ్ కోసం రెడీ చేస్తున్న ఈ వెబ్ సీరిస్ కోసం భారీ  బడ్జెట్‌ను కేటాయించారు చిత్ర నిర్మాతలు. ఒక్కో ఎపీసోడ్‌కు రూ.7కోట్లు ఖర్చు చేయనున్నారు.

ఈ సిరీస్‌ శివగామి పాత్ర నేపథ్యంగా ఉండబోతుంది కాబట్టి దీనికి ‘ఓ శివగామి’ అనే టైటిల్‌ని పెడితే బాగుంటుందని నిర్మాతలు యోచిస్తున్నారట. దాదాపు అంతా కొత్త నటీనటులతోనే నిర్మిస్తున్న ఈ సిరీస్‌ను ఎప్పటి నుంచి అమెజాన్ ప్రైమ్ లో లైవ్ లో రానుంది. ఎవరెవరు దీనిలో నటించారు అనేది త్వరలోనే ప్రకటించనున్నారని సమాచారం.