మొత్తానికి విజయ్ దేవరకొండ నుంచి మరో డిఫరెంట్ ఫిల్మ్ రాబోతోంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో కాలేజ్ బ్యాక్ డ్రాప్ లో వస్తోన్న ఈ సినిమాను భరత్ కమ్మా తెరకెక్కించాడు. అయితే సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా అయిపోవడంతో చిత్ర యూనిట్ ట్రైలర్ ను సిద్ధం చేసింది. 

తెలుగు - తమిళ్ - కన్నడ - మళయాలం భాషల్లో ఒకేసారి రిలీజ్ చేయనున్నారు. అందుకోసం 11వ తేదీ ఉదయం 11 గంటల 11 నిమిషాలకు ముహూర్తం సెట్ చేశారు. స్పెషల్ సమయంలో రిలీజ్ కానున్న డియర్ కామ్రేడ్ ట్రైలర్ కోసం సౌత్ ఆడియెన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 

రష్మిక మందన్నా హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో విజయ్ దేవరకొండ యాంగ్రీ యంగ్ మ్యాన్ గా కనిపించనున్నాడట. సినిమాలో మాస్ ఆడియెన్స్ మెచ్చే అంశాలతో పాటు రొమాంటిక్ డోస్ కూడా గట్టిగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఇక సినిమాను ఈ నెల 26న రిలీజ్ చేయనున్నారు.