విజయ్ దేవరకొండ - రష్మిక మందన్నా కలిసి నటించిన రెండవ చిత్రం డియర్ కామ్రేడ్ ఈ నెల 26న రిలీజ్ కానుంది. అయితే ఆ సినిమాకు సంబందించిన ప్రమోషన్స్ డోస్ పెంచేందుకు హీరో విజయ్ దేవరకొండ స్ట్రాంగ్ గా సిద్దమయ్యాడు. రౌడీ హీరో అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తోన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ కి కూడా డేట్ ఫిక్సయ్యింది. 

వైజాగ్ లో గ్రాండ్ గా ఈ నెల 22న సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించబోతున్నారు. రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్ ఈ రోజు విడుదలైన సంగతి తెలిసిందే. విజయ్ దేవరకొండ మరోసారి తన నటనతో ఆడియెన్స్ ని ఎట్రాక్ట్ చేస్తున్నాడు. ఇక సాంగ్స్ కి కూడా రెస్పాన్స్ పాజిటివ్ గా ఉండడంతో సినిమాను ప్రీ రిలీజ్ కూడా జనాలు భారీగా వచ్చే అవకాశం ఉంది.

వారం ముందే ఈవెంట్ కి సంబందించిన పనులను స్టార్ట్ చేయనున్నారు. భరత్ ఖమ్మ దర్శకత్వం వహించిన ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మించింది. డియర్ కామ్రేడ్ తెలుగుతో పాటు తమిళ్ కన్నడ మలయాళం భాషల్లో ఒకేసారి రిలీజ్ కాబోతోంది.