సినిమాలు హిట్ అవటం..ప్లాఫ్ అవటం సినిమా బిజినెస్ లో సర్వ సాధారణం. అయితే ఊహించని విధంగా అవి తమ కెరీర్ పై , బిజినెస్ ప్రభావం చూపిస్తే మాత్రం ఇబ్బందిగా ఉంటుంది. విజయ్ దేవరకొండకు తాజా చిత్రం డియర్ కామ్రేడ్  డిజాస్టర్ అవటాన్ని ఆయన లైట్ తీసుకున్నా కరణ్ జోహార్ కు మాత్రం ఇబ్బందిగా మారిందట. నూతన దర్శకుడు భరత్ కమ్మ తెరకెక్కించిన ఈ చిత్రం..హిందీ రీమేక్ కు మార్పులు చేర్పులుతో వెర్షన్ రాయించి, హీరోలను వినమన్నా ఎవరూ ఆసక్తి చూపించటం లేదట.

ఎంత పెద్ద నిర్మాత అయితే మాత్రం ఇలా ఓ ప్లాఫ్ సినిమాలో చేయమని అడుగుతాడా అని వాపోతున్నారట. చనువు ఉన్న కుర్ర హీరోలు కరుణ్ జోహార్ మొహం మీదే ఆ మాట అనేసారట. ఇలాంటి రెస్పాన్స్ ని కరుణ్ జోహార్ ఎక్సపెక్ట్ చేయలేదుట. డియర్ కామ్రేడ్ విషయంలో తన అంచనా తప్పినందుకు బాధ పడాలో..లేక తను అడిగినా హీరోలు పలకక పోవటంతో ఎలా స్పందించాలో తెలియటం లేదుట.

 ప్లాఫ్ లు తనూ చూసాను కానీ ఇలా ఇబ్బంది పడిన సందర్బాలు లేవని అంటున్నారట. డియర్ కామ్రేడ్ రిలీజ్ కు ముందు తను చేసిన ట్వీట్ సినిమా ప్రమోషన్ కు ఉపయోగపడిందో లేదో కానీ బాలీవుడ్ లో తన రెప్యుటేషన్ మీద మాత్రం దెబ్బ కొట్టిందని భావిస్తున్నారట. ఇప్పుడు హీరో దొరకటం లేదని వెనకడుగు వేయాలా లేక దాన్ని మార్పులు చేర్పులు తన స్టైల్ లో చేసి హిట్ కొట్టి చూపించాలా అనేది డైలమోగా మారిందిట.  

ఇక డియర్ కామ్రేడ్ సినిమా విజయ్ దేవరకొండ కెరీర్ లో బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది.  ఫ్యాన్స్ కూడా ఈ సినిమాని కాపాడలేకపోయారు.  
ఫైనల్ గా సినిమా క్లోజింగ్ కలెక్షన్స్ చూస్తే షాకయ్యే పరిస్దితి.  34కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసి భారీగా విడుదలైన డియర్ కామ్రేడ్ వరల్డ్ వైడ్ గా 21.47కోట్లను మాత్రమే రాబట్టగలిగిగింది.  తెలుగులో మాత్రమే కాదు..తమిళ్ లో అలాగే మలయాళంలో డియర్ కామ్రేడ్ నిర్మాతలకు బారి నష్టాలను కలుగజేసినట్లు తెలుస్తోంది. 

 హిట్ పెయిర్‌గా ‘గీత‌గోవిందం’లో పేరు సంపాదించుకున్న విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ర‌ష్మిక జంట‌గా న‌టించారు.  ఓ కాలేజ్ స్టూడెంట్ లీడ‌ర్‌, స్టేట్ లేడీ క్రికెట‌ర్ మ‌ధ్య సాగే ప్రయాణ‌మే ఈ చిత్రం. భరత్ కమ్మ దర్శకత్వం వహించిన ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ - బిగ్ బెన్ సినిమాస్ సంయుక్తంగా నిర్మించారు.