Asianet News TeluguAsianet News Telugu

వెంకీ సరసన రకుల్, రీమేక్ కి గ్రీన్ సిగ్నల్

మొదటనుంచీ వెంకటేష్ కు రీమేక్ లు చేయటం అంటే ఇష్టం. ఆయన కెరీర్ లో సూపర్ హిట్స్ అనిపించుకున్న వాటిల్లో రీమేక్ లే ఎక్కువ. అయితే ఈ మధ్యన ఇతర భాషల్లో హిట్ సినిమాలు ఇక్కడ డైరక్ట్ గా డబ్బింగ్ వెర్షన్ రిలీజ్ అవుతున్న నేపధ్యంలో రీమేక్ కాస్త తగ్గాయి. అందులోనూ ఆయన ఏజ్ కు తగ్గ హీరోలు ప్రక్క రాష్ట్రాల్లో సినిమాలు చేసి హిట్ కొట్టేవాళ్లు మరీ తగ్గిపోయారు.

De De Pyaar De remake in telugu with Venkatesh?
Author
Hyderabad, First Published Jun 6, 2019, 9:26 AM IST

మొదటనుంచీ వెంకటేష్ కు రీమేక్ లు చేయటం అంటే ఇష్టం. ఆయన కెరీర్ లో సూపర్ హిట్స్ అనిపించుకున్న వాటిల్లో రీమేక్ లే ఎక్కువ. అయితే ఈ మధ్యన ఇతర భాషల్లో హిట్ సినిమాలు ఇక్కడ డైరక్ట్ గా డబ్బింగ్ వెర్షన్ రిలీజ్ అవుతున్న నేపధ్యంలో రీమేక్ కాస్త తగ్గాయి. అందులోనూ ఆయన ఏజ్ కు తగ్గ హీరోలు ప్రక్క రాష్ట్రాల్లో సినిమాలు చేసి హిట్ కొట్టేవాళ్లు మరీ తగ్గిపోయారు. ఈ నేపధ్యంలో ఆయన స్టైయిట్ సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నారు. అయితే రీసెంట్ గా ఆయన కన్ను ఓ రీమేక్ పై పడింది.

దాన్ని తెలుగులో చేయాలని ఉత్సాహపడుతున్నట్లు సమాచారం. అది మరేదో కాదు హిందీలో అజయ్ దేవగన్, టబు, రకుల్ ప్రీతి సింగ్ చేసిన దే దే ప్యార్ దే. ఈ సంవత్సరం  ప్రారంభంలోనే ‘ఎఫ్ 2’ సినిమాతో గ్రాండ్ సక్సెస్ అందుకున్నారు విక్టరీ వెంకటేష్. ఆయన ప్రస్తుతం బాబీ డైరెక్షన్లో నాగ చైతన్యతో కలిసి ‘వెంకీ మామ’ చేస్తున్నారు. ఆ సినిమా ఈ ఏడాదిలోనే రిలీజ్ కానుంది. ఈ చిత్రం కాకుండా ఈ సీనియర్ హీరో ఇంకో రెండు సినిమాల్ని లాక్ చేసినట్టు తెలుస్తోంది. అందులో ఒకటి దేదే ప్యార్ దే రీమేక్. 

ఆ సినిమాను ‘నేను లోకల్, సినిమా చూపిస్తా మామ’ ఫేమ్ త్రినాథరావ్ నక్కిన డైరెక్షన్లో చేయించాలనే ఆలోచనలో సురేష్ బాబు ఉన్నారట. హిందీలో టబు చేసిన పాత్రకు గానూ త్రిషను, రకుల్ పాత్రకు రకుల్ నే తీసుకుని ఫన్ తో ఈ సినిమాని చేసి హిట్ కొట్టాలని ఆయన భావిస్తున్నారట. 

అలాగే  వెంకటేష్ తో మరో  సినిమా యువ దర్శకుడు తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో ఉంటుందని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత, వెంకటేష్ సోదరుడు సురేష్ బాబు నిర్మిస్తారట. వీటిని త్వరలోనే అధికారికంగా అనౌన్స్ చేయనున్నారు.  

ఇంట్లో ఇల్లాలు వంటిల్లో ప్రియురాలు వంటి సినిమాలు చేసిన అనుభవంతో వెంకీ  ఈ దేదే ప్యార్ దే సినిమాని దుమ్ము దులిపేస్తాండున్నారు.   మ్యారేజ్‌ అండ్‌ మోడ్రన్‌ డేస్‌ రిలేషన్‌షిప్స్‌ కాన్సెప్ట్‌ ఆధారంగా ఈ సినిమా నడుస్తుంది.  ‘దే దే ప్యార్‌ దే’ అనే టైటిల్‌ అర్దం ఏమిటంటే.. అంటే.. ఇవ్వు.. ఇవ్వు.. ప్రేమ ఇవ్వు అని అర్థం.  

Follow Us:
Download App:
  • android
  • ios