సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించిన తాజా చిత్రం ‘సర్కారు వారి పాట’ (Sarkaru Vaari Paata). ఈ మూవీ నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. మేకర్స్ తాజాగా టైటిల్ సాంగ్ పై అప్డేట్ అందించారు.
బ్యాకింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న యాక్షన్ డ్రామా ‘సర్కారు వారి పాట’. ఈ చిత్రానికి గీతా గోవిందం చిత్ర ఫేమ్ డైరెక్టర్ పరుశురామ్ పెట్ల (Parusuram Petla) దర్శకత్వం వహిస్తున్నారు. మహేశ్ బాబు (Mahesh Babu) ప్రధాన పాత్రలో నటిస్తుండగా, హీరోయిన్ కీర్తి సురేశ్ (Keerthy Suresh) కథనాయికగా నటిస్తోంది. సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ థమన్ అదిరిపోయే సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజ్ అయిన ‘కళావతి’, ‘పెన్నీ’ సాంగ్స్ ప్రేక్షకులను, సంగీత ప్రియులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.
ఇప్పటికే ఈ మూవీ చిత్రీకరణ భాగం పూర్తైంది. ఏప్రిల్ 18న చివరి సాంగ్ కోసం కూడా షూట్ ప్రారంభించినట్టు మేకర్స్ తెలిపారు. ఈ మేరకు షూట్ స్పాట్ నుంచి మహేశ్ బాబు కాలుకు కర్ఛీఫ్ కట్టుకున్న ఫొటోను రిలీజ్ చేశారు. ఈ సాంగ్ తో పూర్తి సినిమా షూటింగ్ కంప్లీట్ అయ్యింది. చివరి సాంగ్ షూట్ తో తన వర్క్ కూడా కంప్లీట్ కాబోతోందని హీరోయిన్ కీర్తి సురేశ్ కూడా తెలిపారు. అయితే తాజాగా మేకర్స్ నుంచి అదిరిపోయే అప్డేట్ అందింది.
సర్కారు వారి పాటలకు మంచి క్రేజ్ ఉండటంతో ఆడియెన్స్ ఎదురుచూస్తున్నారు. సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ (Thaman) అదిరిపోయే మ్యూజిక్ అందిస్తున్నారు. అయితే ఏప్రిల్ 23న ఉదయం 11:07 గంటలకు సర్కారు వారి పాట నుంచి టైటిల్ సాంగ్ రిలీజ్ కాబోతున్నట్టు అనౌన్స్ చేశారు. ఈసారి స్పీకర్స్ పగిలిపోయేలా థమన్ మ్యూజిక్ వాయించారని తెలిపారు మేకర్స్. మరోవైపు థమన్ కూడా టైటిల్ సాంగ్ కంపోజ్ చేస్తున్న వీడియోను వదిలారు. ‘ఎస్వీపీ (SVP) టైటిల్ సాంగ్ కు చెవులు పగిలిపోవాల్సిందే’నని పేర్కొన్నాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
