నాని, కీర్తిసురేష్‌ జంటగా నటించిన చిత్రం `దసరా`. తెలంగాణ బ్యాక్‌ డ్రాప్‌లో రూపొందుతున్న ఈ చిత్రం ట్రైలర్‌ తాజాగా విడుదలైంది. ఊరమాస్‌గా సాగే ట్రైలర్‌ గూస్‌బంమ్స్ తెప్పిస్తుంది. 

నేచురల్‌ స్టార్‌ నాని నటించిన లేటెస్ట్ మూవీ `దసరా`. కీర్తి సురేష్‌ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రానికి శ్రీకాంత్‌ ఓడెల దర్శకత్వం వహించారు. ఈ నెలలోనే విడుదల కాబోతున్న ఈ సినిమా ట్రైలర్‌ తాజాగా విడుదలైంది లక్నో వేదికగా ట్రైలర్‌ని రిలీజ్‌ చేశారు. తాజాగా విడుదలైన ట్రైలర్‌ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. ఊరమాస్‌ లుక్‌లో సాగే ట్రైలర్‌ గూస్‌ బంమ్స్ తెప్పిస్తుంది. నాని నెవర్‌ బిఫోర్‌ అనేలా ఈ ట్రైలర్‌ సాగడం విశేషం. ఆద్యంతం యాక్షన్‌ అంశాలతో ఈ ట్రైలర్‌ సాగుతుంది. 

నాని ఇందులో ధరణిగా పూర్తి డీ గ్లామర్‌ లుక్‌లో కనిపిస్తున్నారు. రా అండ్‌ రస్టిక్‌గా ఈ ట్రైలర్‌ సాగుతుంది. ఆయన నటన సినిమాకి హైలైట్‌గా నిలవబోతుంది. ఇక ఇందులోని తెలంగాణ యాసలో సాగే డైలాగ్‌లు ఆదిరిపోయేలా ఉన్నాయి. కాకపోతే అంతటి పవర్‌ఫుల్‌గా అనిపించకపోవడంతో ఏదో అసంతృప్టి అనిపిస్తుంది. ఏదైతే అదైంది బాంచెత్‌ అని మరోసారి ఇందులో వాడారు నాని. మరోవైపు కొన్ని పదాలన పచ్చిగా వాడారు.

ఇక ట్రైలర్ `చిత్తు చిత్తులా గుమ్మ` అంటూ తెలంగాణ జానపద బతకమ్మ పాటతో ప్రారంభం కావడం విశేషం. కీర్తిసురేష్‌ మొదట పెళ్లికూతురిగా కనిపించింది. ఆ తర్వాత ధరణిగా పెట్టి పుట్టావురా నా కొడకా అంటూ ఆమె చెప్పిన డైలాగ్‌ ఆకట్టుకుంటుంది. యాక్షన్‌ సీన్స్ లో దుమ్మురేపాడు నాని. విరోచితంగా విశ్వరూపం చూపించారు. మరోవైపు తెలంగాణ డైలాగ్‌లతో ఆదరగొట్టాడు. ఈ క్రమంలో ఒక్కొక్కనికి మొల్తాడు కింద గుడాల్‌ రాల్తయ్‌.. బ్యాంచెత్‌ `అని చెప్పడం హైలైట్‌గా నిలిచింది. మరోవైపు కీర్తి సురేష్‌ లుక్‌ సైతం ఆకట్టుకుంటుంది. ఆమె ఎప్పుడూ కనిపించని లుక్‌ లో డీ గ్లామర్‌గా కనిపిస్తుంది. రెండు వర్గాల మధ్య గొడవ ప్రధానంగా ఈ సినిమా సాగుతుందని ట్రైలర్‌ చూస్తుంటే తెలుస్తుంది. 

పాన్‌ ఇండియా చిత్రంగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మించగా సంతోష్ నారాయణన్ దీనికి మ్యూజిక్ అందించారు. మొదటి నుండి అందరిలో మంచి అంచనాలు ఏర్పరిచిన ఈ మూవీ నుండి ఇటీవల రిలీజ్ అయిన సాంగ్స్, టీజర్, ఫస్ట్ లుక్ పోస్టర్స్ అన్ని కూడా ఆడియన్స్ ని అలరించి మూవీ పై అంచనాలు మరింతగా పెంచాయి. తాజాగా విడుదలైన ట్రైలర్‌ ఆ అంచనాలను మరింత పెంచింది. ఇప్పటి వరకు ఆశించిన స్థాయిలో బజ్‌ లేదు. ఇప్పుడీ ట్రైలర్‌ ఆ బజ్‌ తీసుకొస్తుందని చెప్పొచ్చు. తెలుగుతోపాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీలో ఈ చిత్రం ఈ నెల 30న గ్రాండ్‌గా విడుదల కాబోతుంది. 

YouTube video player