జేమ్స్ బాండ్ సినిమాలంటే తెలియని సినీ ప్రేక్షకుడు ఉండడు,. 1962 నుంచి ఇప్పటివరకు వచ్చిన 24 బాండ్ చిత్రాలు వరల్డ్ వైడ్ గా ప్రత్యేక గుర్తింపును అందుకున్నాయి. బాక్స్ ఆఫీస్ వద్ద సరికొత్త రికార్డులు క్రియేట్ చేసిన ఆ సినిమాల సిరీస్ ప్రపంచం ఉన్నంత వరకు కొనసాగేలా ఉంది. ఇక ఇప్పుడు మరో సిరీస్ రెడీ అవుతోంది. 

25వ జేమ్స్ బాండ్ టైటిల్ ని రిలీజ్ చేసిన చిత్ర యూనిట్ సినిమా రిలీజ్ డేట్ ని కూడా ఫైనల్ చేసింది. డేనియల్‌ క్రెగ్‌ కథానాయకుడిగా రూపొందుతున్న ఈ బాండ్ మూవీకి ‘నో టైం టు డై’  అనే స్ట్రాంగ్ టైటిల్ ని ఫిక్స్ చేశారు. చనిపోయే టైమ్ లేదు అనే అర్ధమున్న ఈ లైన్ సినిమాపై ఒక్కసారిగా అంచనాలను పెంచేసింది. 

మోట్రో గోల్డెన్‌ మేయర్‌, ఇయోన్ ప్రొడక్షన్స్‌ సంస్థలు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాకు ప్రముఖ దర్శకుడు డేనియల్‌ క్రెగ్‌ తెరకెక్కిస్తున్నాడు. ఇక సినిమాను మొదట  2020 ఏప్రిల్ 3న యూకేలో రిలీజ్ చేసి అనంతరం 2020 ఏప్రిల్ 8న అమెరికాలో విడుదల చేయనున్నట్లు చెప్పారు, మరి ఈ జేమ్స్ బండ్ బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి రికార్డులు బద్దలుకొడతాడో చూడాలి.