ఓ సినిమా చేస్తున్నప్పుడు దర్శక,నిర్మాతలకు, హీరోకు మధ్య క్రియేటివ్ డిఫెరెన్సెస్ లు రాకుండా ఉండటం కాష్ట కష్టమే. ముఖ్యంగా హీరోనే, నిర్మాత అయినప్పుడు మరీ కష్టం. ఎందుకంటే డైరక్టర్ కు తను రాసుకున్న స్క్రిప్టుని ఏ విధంగా తెరకెక్కించాము..ఏ సీన్ కీలకం అనే ఓ విధమైన ఆలోచన ఉంటుంది. 

నిర్మాతకు ఫైనల్ అవుట్ ఎలా ఉంటుంది..ఎక్కడ బడ్జెట్ కట్ చేయాలి..వివాదాలు రాకుండా ఏం ప్లాన్ చేయాలి అనే ప్లానింగ్ తో కూడిన ఆలోచనలు ఉంటాయి. ఇద్దరి ఆలోచనలు కలిస్తే ఏ సమస్యా రాదు. ఎక్కడైనా క్లాష్ మాత్రం అది ప్రాజెక్టు రిజెల్టు పై పడుతుంది. ఇప్పుడు ఎన్టీఆర్ బయోపిక్ విషయంలో బాలయ్య ,క్రిష్ మధ్య కొన్ని క్రియేటివ్ డిఫెరెన్సెస్ వస్తున్నాయని ఫిల్మ్ నగర్ లో టాక్ వినపడుతోంది.

క్రిష్ మొదట తాను ఫైనల్ చేసుకున్న స్క్రిప్టు ప్రకారం వెళ్లిపోతూ..అదే విధంగా ఎడిటింగ్ సైతం చేయిస్తున్నారట. కానీ ఆ ప్రాసెస్ లో లెంగ్త్ పెరిగిపోతోంది..అంతేకాదు కొన్ని అవసరమైన విషయాలుకు ప్రయారిటీ లేకుండా పోతోందని బాలయ్య భావిస్తున్నారట. మూడు గంటలు పైగా డ్యూరేషన్ ఫస్ట్ పార్ట్ వస్తోందని వినికిడి. ముఖ్యంగా మొదటి భాగంలో  ఎన్టీఆర్ నటించిన, తీసిన కళాఖండాలు అన్నింటినీ కవర్ చేయాలనేది బాలయ్య ఆలోచన. 

అలాగే.., ఆయన వ్యక్తిగత జీవితాన్ని కూడా కవర్ చెయ్యాలనేది క్రిష్ థాట్. రెండు కలిపి చెయ్యాలంటే లెంగ్త్ బాగా పెరిగిపోతోంది. ఏదో ఒకటి తగ్గించాల్సిన పరిస్దితి. ఎడిటర్ కు కత్తి మీద సామే. దాంతో ఎలక్షన్ ప్రచారం నుంచి వచ్చిన బాలయ్యతో ఈ విషయమై క్రిష్ చర్చ జరిపి...ఇంకా చెప్పాలంటే కొన్ని సీన్స్ కోసం ఫైట్ చేసి మరీ ఫైనల్ అవుట్ పుట్ ఇవ్వటానికి డిసైడ్ అయ్యారట. అదీ విషయం.