Asianet News TeluguAsianet News Telugu

సిద్ధార్థ్‌ `టక్కర్‌` నుంచి థర్డ్ సింగిల్‌ ఔట్‌.. కట్టిపడేస్తున్న `ఊపిరే` సాంగ్‌

హీరో సిద్ధార్థ్‌ కి తెలుగులో మంచి మార్కెట్‌ ఉంది. `నువ్వొస్తానంటే నేనొద్దంటానా', 'బొమ్మరిల్లు'  చిత్రాలతో ఇక్కడి ఆడియెన్స్ ని మెప్పించాడు. కానీ ఆ తర్వాత ఆ స్థాయి హిట్‌ పడలేదు. ఇప్పుడు `టక్కర్‌`తో మరోసారి సత్తా చాటేందుకు వస్తున్నాడు.

crazy song out from hero siddharth starrer takkar movie arj
Author
First Published May 26, 2023, 11:08 PM IST

హీరో సిద్ధార్థ్‌.. కొంత గ్యాప్‌ తర్వాత మరోసారి తెలుగు ఆడియెన్స్ ని అలరించేందుకు వస్తున్నారు. ఇప్పటికే ఆయన `నువ్వొస్తానంటే నేనొద్దంటానా', 'బొమ్మరిల్లు' వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని స్థానాన్ని సంపాదించుకున్న విషయం తెలిసిందే. కానీ ఆ తర్వాత సరైన హిట్‌ పడలేదు. ఈ నేపథ్యంలో చాలా గ్యాప్‌తో ఇప్పుడు `టక్కర్‌` అంటూ వస్తున్నాడు సిద్ధార్థ్‌. కార్తీక్ జి. క్రిష్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, పాషన్ స్టూడియోస్ తో కలిసి టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. వివేక్ కూచిభొట్ల సహా నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాలో దివ్యాంశ కౌశిక్ కథానాయికగా నటిస్తున్నారు. సినిమా వచ్చే నెల 9న తెలుగు, తమిళంలో విడుదల కాబోతుంది.

ఇప్పటికే విడుదలైన 'టక్కర్' మూవీ టీజర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. టీజర్ లో సిద్ధార్థ్ సరికొత్త మేకోవర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ చిత్రంతో సిద్ధార్థ్ మరో భారీ విజయాన్ని అందుకోవడం ఖాయమనే అంచనాలున్నాయి. అలాగే ఈ సినిమా నుంచి విడుదలైన 'కయ్యాలే', 'పెదవులు వీడి మౌనం' పాటలు కూడా విశేష ఆదరణ పొందాయి. తాజాగా ఈ చిత్రం నుంచి 'ఊపిరే' అంటూ సాగే మూడో పాట విడుదలైంది. ఈ చిత్రానికి నివాస్ కె ప్రసన్న సంగీతం అందించగా, కృష్ణకాంత్ అన్ని పాటలకు సాహిత్యం అందించారు. 

``కయ్యాలే', 'పెదవులు వీడి మౌనం' పాటల మాదిరిగానే 'ఊపిరే' పాట కూడా కట్టిపడేసేలా ఉంది. అభయ్ జోధ్‌పుర్కర్, సంజన కలమంజే ఈ పాటను ఎంతో అందంగా ఆలపించారు. `సొగసే మా వీధి వైపు.. సరదాగా సాగెనే.. దిశలేమో నన్ను చూసి.. కను గీటెనే` అంటూ కథానాయికపై హీరోకి ఉన్న ప్రేమను తెలిపేలా ఎంతో అందంగా ఉంది ఈ పాట. తేలిక పదాలతో లోతైన భావం పలికించారు కృష్ణకాంత్. నాయకా నాయికల మధ్య మొహాన్ని తెలిపేలా అద్భుతమైన సాహిత్యంతో పాట సాగింది. సంగీతానికి, సాహిత్యానికి తగ్గట్టుగానే నాయకా నాయికల మధ్య కెమిస్ట్రీ కూడా చక్కగా కుదిరింది. 

పాట వినగానే నచ్చేలా ఉంది. గత రెండు పాటల్లాగే ఈ పాట కూడా విశేష ఆదరణ పొందుతుందని స్పష్టమవుతోంది. మొత్తానికి టక్కర్ నుంచి విడుదలవుతున్న ఒక్కో పాట విశేషంగా ఆకట్టుకుంటూ, సినిమాపై అంచనాలను రోజురోజుకి పెంచేస్తోంది.ఈ రొమాంటిక్ యాక్షన్ రైడ్ ప్రేక్షకులను ఆకట్టుకొని ఘన విజయం సాధిస్తుంద`ని తెలిపారు నిర్మాతలు. ఈ సినిమాలో అభిమన్యు సింగ్, యోగి బాబు, మునీశ్ కాంత్, ఆర్జే విజ్ఞేశ్ కాంత్ తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. నివాస్ కె. ప్రసన్న సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ గా వాంచినాథన్ మురుగేశన్, ఎడిటర్ గా జీఏ గౌతమ్, ఆర్ట్ డైరెక్టర్ గా ఉదయ కుమార్ కె వ్యవహరిస్తున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios