కోలీవుడ్ కి చెందిన ప్రముఖ సీనియర్ కమెడియన్ క్రేజీ మోహన్(67) ఈరోజు చెన్నైలో మరణించారు. సోమవారం మధ్యాహ్నం సడెన్ గా హార్ట్ ఎటాక్ రావడంతో వెంటనే కుటుంబసభ్యులు హాస్పిటల్ కి తరలించారు. కానీ ఉపయోగం లేకుండా పోయింది.

వైద్యులు ఎంతగా ప్రయత్నించినా.. ఆయన్ని కాపాడలేకపోయారు. 1952లో పుట్టిన ఆయన మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేశారు. ఇంజనీరింగ్ చదివే రోజుల్లోనే కొన్ని నాటకాలకు స్క్రిప్ట్ లు రాశారు. ఆ తరువాత ఓ నాటక కంపనీకి స్క్రిప్ట్ రైటర్ గా పని చేసి 'పొయ్‌క‌ల్ కుద‌రై' అనే సినిమాతో నటుడిగా ఎంట్రీ ఇచ్చాడు.

కె. బాలచందర్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా క్రేజీ మోహన్ కి మంచి పేరు తీసుకొచ్చింది. అపూర్వ స‌హోద‌రులు, మైకేల్ మ‌ద‌న కామ‌రాజు, స‌తీలీలావ‌తి, తెనాలి, పంచ‌తంత్రం, కాద‌ల కాద‌ల‌, భామ‌నే స‌త్య‌భామ‌నే, వ‌సూల్ రాజా ఎం.బి.బి.ఎస్ వంటి చిత్రాల్లో కమెడియన్ గా నటించాడు. 

నటుడిగా, రైటర్ గానే కాదు.. చిత్రకారుడిగా కూడా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. ఈయన మరణ వార్త తెలుసుకున్న సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.