చిరంజీవి కెరీర్ లో ఠాగూర్ చిత్రానికి చాలా ప్రత్యేకత ఉంది. బ్లాక్ బస్టర్ విజయం అందుకున్న ఠాగూర్ తరహా చిత్రం చిరు చేస్తే చూడాలని ఫ్యాన్స్ ఎప్పటి నుండో ఎదురుచూస్తుండగా... అది త్వరలోనే సాకారం కానున్నట్లు వార్తలు వస్తున్నాయి.

2003లో విడుదలైన ఠాగూర్ (Tagore) ఓ సెన్సేషన్. సోషల్ మెసేజ్ తో కూడిన ఠాగూర్ బ్లాక్ బస్టర్ విజయం సాధించడంతో పాటు అనేక బాక్సాఫీస్ రికార్డ్స్ తిరగరాసింది. తమిళ మూవీ రమణ చిత్రానికి ఠాగూర్ అధికారిక రీమేక్. తమిళంలో ఏ ఆర్ మురుగదాస్ దర్శకత్వం వహించగా... తెలుగులో వివి వినాయక్ డైరెక్ట్ చేశారు. సోషల్ సబ్జెక్టుకి కమర్షియల్ అంశాలు జోడించి మెగా ఫ్యాన్స్ కి కావాల్సిన ఓ పర్ఫెక్ట్ మూవీగా వివి వినాయక్ తీర్చిదిద్దారు. ఠాగూర్ తర్వాత ఇదే తరహాలో సోషల్ సబ్జెక్టు తో స్టాలిన్ తెరకెక్కింది. అయితే ఠాగూర్ అంత విజయం స్టాలిన్ అందుకోలేదు. 

2006లో స్టాలిన్ విడుదల కాగా.. మరలా ఆ తరహా మూవీ చిరంజీవి (Chiranjeevi) చేయలేదు. అయితే ఫ్యాన్స్ కోరిక త్వరలో తీరనుందని సమాచారం అందుతుంది. యంగ్ డైరెక్టర్ వెంకీ కుడుములతో చిరంజీవి కొత్త మూవీ ప్రకటించిన విజయం తెలిసిందే. నిర్మాత దానయ్య నిర్మిస్తున్న ఈ మూవీ పక్కా సోషల్ మెసేజ్ ఓరియెంటెడ్ చిత్రమట. సమకాలీన సోషల్ ప్రాబ్లంని తీసుకుని దానికి కమర్షియల్ అంశాలు జోడించి చిరంజీవి ఓ అద్భుతమైన స్క్రిప్ట్ వెంకీ కుడుముల సెట్ చేశారట. చిరంజీవి కెరీర్ లో ఇది మరో ఠాగూర్ కావడం ఖాయమన్న మాట వినిపిస్తోంది.

ఇక వెంకీ కుడుములు ఛలో మూవీతో డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చారు. ఆ మూవీ సూపర్ హిట్ కొట్టింది. ఇక 2020లో విడుదలైన భీష్మ మూవీతో మరో సూపర్ హిట్ ఖాతాలో వేసుకున్నారు. భీష్మ చిత్రాన్ని ప్రత్యేకంగా వీక్షించిన చిరంజీవి వెంకీకి అప్పుడే సినిమా ఆఫర్ ఇచ్చారు. చెప్పిన మాట ప్రకారం వెంకీ స్క్రిప్ట్ నచ్చడంతో ప్రాజెక్ట్ ఒకే చేశారు. త్వరలోనే ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది. 

కాగా చిరంజీవి ఏక కాలంలో మూడు చిత్రాల షూటింగ్స్ లో పాల్గొంటున్నారు. కొరటాల శివ తెరకెక్కించిన ఆచార్య (Acharya)విడుదలకు సిద్ధంగా ఉంది. మెహర్ రమేష్ తో చేస్తున్న భోళా శంకర్, దర్శకుడు బాబీ డైరెక్ట్ చేస్తున్న మెగా 154తో పాటు లూసిఫర్ రీమేక్ గాడ్ ఫాదర్ మూవీ సెట్స్ పై ఉన్నాయి. గాడ్ ఫాదర్ మూవీలో ఓ కీలక రోల్ సల్మాన్ చేస్తున్న విషయం తెలిసిందే. ఆయన కూడా సెట్స్ లో జాయిన్ అయ్యారు.