Asianet News TeluguAsianet News Telugu

‘చంద్రముఖి 2’ హీరోయిన్ పై క్రేజీ బజ్.. ఆ స్టార్ హీరోయినే ఫైనల్ అయ్యిందా?

సౌత్ బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ గా నిలిచిన ‘చంద్రముఖి’కి సీక్వెల్ గా ‘చంద్రముఖి 2’ అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. రాఘవా లారెన్స్ ప్రధాన పాత్రలో పోషిస్తున్నారు. ప్రస్తుతం హీరోయిన్ పై క్రేజీ బజ్ క్రియేట్ అయ్యింది.
 

Crazy buzz on Chandramukhi 2 Movie heroine, is that star heroine final?
Author
Hyderabad, First Published Jun 30, 2022, 12:28 PM IST

2005లో విడుదలైన హర్రర్ కామెడీ చిత్రం ‘చంద్రముఖి’ని తెలుగు, తమిళ ఆడియెన్స్ ఇప్పటికీ మరిచిపోలేరు. తమిళ సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ (Rajinikanth), గ్లామర్ బ్యూటీ నయనతార, జ్యోతిక కలిసి నటించారు. దర్శకుడు పీ వాసు అటు హర్రర్ ను.. ఇటు కామెడీని అద్భుతంగా చూపించారు. అయితే ఎప్పటి నుంచో ఈ చిత్రానికి సీక్వెల్ రాబోతుందంటూ వార్తలు పుట్టుకొచ్చాయి. వాటిని నిజం చేస్తూ ఇటీవల లైకా ప్రొడక్షన్ సంస్థ ‘చంద్రముఖి 2’ (Chandramukhi 2)ను అధికారికంగా ప్రకటించింది. 

అయితే సీక్వెల్ లో రజినీకాంత్ కు బదులుగా రాఘవ లారెన్స్ (Raghava Lawrence) ప్రధాన పాత్రలో  పోషిస్తున్నారు. ప్రముఖ కమెడియన్ వడివేలు కీలక పాత్రలో కనిపించనున్నారు. లైకా ప్రొడక్షన్ సంస్థ చిత్రాన్ని నిర్మిస్తోంది. ‘చంద్రముఖి’ని తెరకెక్కించిన దర్శకుడు పీ వాసునే సీక్వెల్ ను కూడా తెరకెక్కిస్తున్నారు. అయితే కథ విషయానికొస్తే.. దానికి కొనసాగింపుగా రాదని తెలుస్తోంది. మరో కొత్త అంశాన్ని తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తోంది. దాదాపు గా  17 ఏండ్ల తర్వాత ఈ సీక్వెల్ రాబోతుండటంతో తెలుగు, తమిళ ప్రేక్షకులు ఎగ్జైట్ ఫీల్ అవుతున్నారు. ఇప్పటికే రాఘవ లారెన్స్ ‘ముని, కాంచన, గంగ’ వంటి హర్రర్ చిత్రాలతో ఆకట్టుకున్నాడు. 

హర్రర్ అండ్ కామెడీ చిత్రాలతో తన మార్క్ చూపిస్తున్న రాఘవ లారెన్స్ ‘చంద్రముఖి 2’లో నటిస్తుండటం పట్ల అటు రజినీకాంత్ కూడా హ్యాపీగా ఫీలయ్యారంట. ఇప్పటికే అధికారికంగా చిత్రాన్ని ప్రకటించిన లైకా ప్రొడక్షన్ చిత్ర స్టార్ కాస్ట్ ను వెతికే పనిలో నిమగ్నమైంది. తాజాగా సీక్వెల్ కు హీరోయిన్ ఎవరనేదిపై ఇంట్రెస్టింగ్ బజ్ క్రియేట్ అయ్యింది. అయితే పలు హర్రర్ చిత్రాల్లో నటించి మెప్పించిన స్టార్ హీరోయిన్ త్రిష (Trisha)ను ఎంపిక చేసినట్టు వార్తలు వస్తున్నాయి.

త్రిష అయితే అటు తమిళ ఆడియెన్స్, ఇటు తెలుగు ఆడియెన్స్ కు బాగా తెలుసు గనుక ఆమెనే ఫైనల్ చేయాలని భావిస్తున్నారంట చిత్ర యూనిట్. ఇంకా స్టార్ కాస్ట్ కు సంబంధించిన పూర్తి వివరాలు రావాల్సి ఉంది. ఈ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం కీరవాణీ మ్యూజిక్ అందిస్తున్నారు. కెమెరామేన్‌గా ఆర్‌డీ రాజశేఖర్‌  బాధ్యలు చెపట్టారు. ప్రముఖ ఆర్ట్‌ డైరెక్టర్ తోట తరణి కూడా వర్క్ చేయనున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios