NTR: కబడ్డీ ప్లేయర్ గా ఎన్టీఆర్? అదిరిపోయే పవర్ ఫుల్ టైటిల్!
ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు(Buchhibabu sana) సానాతో ఎన్టీఆర్ మూవీ దాదాపు ఖాయమే అన్న వార్తలు సంచలనం రేపుతున్నాయి. అధికారిక ప్రకటనే మిగిలి ఉంది. బుచ్చిబాబు దర్శకత్వంలో ఎన్టీఆర్ కొత్త చిత్రానికి సైన్ చేశారని ఓ వారం రోజుల నుండి స్ట్రాంగ్ గా వినిపిస్తుంది.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR) లేటెస్ట్ మూవీ ఆర్ ఆర్ ఆర్ విడుదల కోసం ఓ ప్రక్క ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు మరో రెండు నెలల్లో ఆర్ ఆర్ ఆర్ థియేటర్స్ లో దిగనుంది. కరోనా ఆంక్షల నేపథ్యంలో జనవరి 7న విడుదల కావాల్సిన ఆర్ ఆర్ ఆర్ మూవీ(RRR Movie) రిలీజ్ వాయిదా పడిన విషయం తెలిసిందే. మార్చ్ 25న ఆర్ ఆర్ ఆర్ విడుదల చేస్తున్నట్లు కొత్త డేట్ ప్రకటించారు. ఇదిలా ఉంటే ఎన్టీఆర్ అప్ కమింగ్ చిత్రాల బజ్ ఫ్యాన్స్ కి గూస్ బంప్స్ కలిగిస్తుంది. ఎన్టీఆర్ తదుపరి చిత్రాల దర్శకుల లిస్ట్ లో కొరటాల శివ, ప్రశాంత్ నీల్, త్రివిక్రమ్ పేర్లు ఉన్నాయి. అలాగే ఇతర పరిశ్రమలకు చెందిన అట్లీ,సంజయ్ లీలా భన్సాలీ వంటి స్టార్ దర్శకుల పేర్లు అనధికారికంగా వినిపిస్తున్నాయి.
కాగా ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు(Buchhibabu sana) సానాతో ఎన్టీఆర్ మూవీ దాదాపు ఖాయమే అన్న వార్తలు సంచలనం రేపుతున్నాయి. అధికారిక ప్రకటనే మిగిలి ఉంది. బుచ్చిబాబు దర్శకత్వంలో ఎన్టీఆర్ కొత్త చిత్రానికి సైన్ చేశారని ఓ వారం రోజుల నుండి స్ట్రాంగ్ గా వినిపిస్తుంది. బుచ్చిబాబు చెప్పిన కథకు ఎన్టీఆర్ ఫిదా అయ్యారట. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కే ఈ స్పోర్ట్స్ డ్రామాలో ఎన్టీఆర్ కబడ్డీ ప్లేయర్ రోల్ చేయనున్నారట.
ఆస్కార్ విన్నర్ ఏ ఆర్ రెహ్మాన్ సంగీతం, హీరోయిన్ గా జాన్వీ కపూర్ అంటూ వరుస కథనాలు వెలువడుతున్నాయి. ఇక ఈ చిత్ర టైటిల్ కూడా తెరపైకి వచ్చింది. 'పెద్ది' అనే ఓ పవర్ ఫుల్ టైటిల్ ఫిక్స్ చేసినట్లు, అది ఎన్టీఆర్ క్యారెక్టర్ నేమ్ అంటున్నారు. మొత్తంగా ప్రచారం అవుతున్న కథనాలు ఫుల్ కిక్ ఇస్తుంటే... అంత చిన్న డైరెక్టర్ కి ఎన్టీఆర్ అవకాశం ఇస్తారా? అనే సందేహాలు మరోవైపు వినిపిస్తున్నాయి.
ఆర్ ఆర్ ఆర్ మూవీతో ఎన్టీఆర్ పాన్ ఇండియా ఇమేజ్ తెచ్చుకోవడం ఖాయం. కొరటాల శివ, ప్రశాంత్ నీల్ చిత్రాలు అధికారికంగా ఎన్టీఆర్ ప్రకటించారు. ఇవి రెండూ పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న చిత్రాలు. అయితే బుచ్చిబాబుతో మూవీ లాంఛనమే, ప్రకటనే తరువాయి అన్న మాట వినిపిస్తోంది. ఏది ఏమైనా అధికారిక ప్రకటన జరిగే వరకు ఈ ప్రాజెక్ట్ ని నమ్మలేం. మరో వైపు కొరటాల చిత్రాన్ని ఎన్టీఆర్ త్వరలో లాంచ్ చేయనున్నారు. రెగ్యులర్ షూటింగ్ కూడా వెంటనే ఉండే సూచనలు కలవు. ఎన్టీఆర్-కొరటాల(NTR 30) చిత్రం 2023 సంక్రాంతి టార్గెట్ గా పూర్తి చేయనున్నారు. ఈ మూవీలో అలియా భట్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా చర్చలలో భాగంగానే అలియా ఇప్పుడు హైదరాబాద్ వచ్చినట్లు సమాచారం.