కరోనా కారణంగా మహేష్ కి ఏడాది గ్యాప్ వచ్చింది. 2020 సంక్రాంతికి సరిలేరు నీకెవ్వరు రూపంలో భారీ హిట్ అందుకున్న మహేష్, సర్కారు వారి పాట చిత్రాన్ని ఇటీవలే సెట్స్ పైకి తీసుకెళ్లారు. సర్కారు వారి పాట మొదటి షెడ్యూల్ మహేష్ దుబాయిలో పూర్తి చేసిన విషయం తెలిసిందే. ఇక సర్కారు వారి పాట చిత్రాన్ని 2021 సంక్రాంతికి విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించేశారు. అంటే దాదాపు సర్కారు వారి పాట విడుదలకు ఏడాది సమయం ఉంది. 


కాగా మహేష్ నెక్స్ట్ మూవీ రాజమౌళితో చేయనున్నారు. దర్శకుడు రాజమౌళి ఇప్పటికే ఆర్ ఆర్ ఆర్ తరువాత తాను మహేష్ తో మూవీ చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే లాక్ డౌన్ కారణంగా ఆర్ ఆర్ ఆర్ విడుదల ఆలస్యం అయ్యింది. ఆర్ ఆర్ ఆర్ విడుదల అక్టోబర్ కి షిఫ్ట్ అయ్యింది. మరి మహేష్ తో రాజమౌళి మూవీకి ఆలస్యం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. 


రాజమౌళి మహేష్ కోసం కథ సిద్ధం చేసి, దాని ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి చేయడానికి కనీసం ఏడాది సమయం పడుతుంది. అందుకే మహేష్ రాజమౌళి మూవీ సెట్స్ పైకి వెళ్లబోయే లోపు సర్కారు వారి పాట చిత్రంతో పాటు మరో మూవీ పూర్తి చేయాలనే ఆలోచన చేస్తున్నారట. దీని కోసం ఆయన నూతన దర్శకుల నుండి కథలు వింటున్నారట. 


ఐతే భీష్మ ఫేమ్ వెంకీ కుడుముల.. మహేష్ కి ఓ కథను వినిపించారట. వెంకీ కుడుముల కథ మహేష్ కి నచ్చినప్పటికీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదట. అదే సమయంలో అనిల్ రావిపూడి మహేష్ కి కథ వినిపించగా ఆయన ఇంప్రెస్ అయ్యారట. అనిల్ రావిపూడి చెప్పిన ఓ ప్రయోగాత్మక చిత్రానికి మహేష్ ఒకే చెప్పాడని టాలీవుడ్ లో టాక్ నడుస్తుంది. మరి ఇదే కనుక నిజం అయితే... అనిల్ రావిపూడి పంట పండినట్లే.