నేషనల్ అవార్డ్ విన్నర్ మలయాళం ప్రముఖ దర్శకుడిగా ఎంతో గుర్తింపు తెచ్చుకున్న ప్రియానందన్ పై ఓ వ్యక్తి దాడి చేయడం అందరిని షాక్ కి గురి చేసింది. మలయాళం చిత్రం పరిశ్రమలో ఈ న్యూస్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. డైరెక్టర్ పై చేయి చేసుకోవడమే కాకుండా మొహంపై పేడ నీళ్లు పోసినట్లు తెలిసింది. 

ఈ విషయాన్నీ దర్శకుడు ప్రియానందన్ మీడియాకు వివరించారు.  'త్రిస్సూర్ జిల్లా చెర్పులో ఇంటి నుంచి ఉదయం 9 గంటల సమయంలో వస్తుండగా ఓ మనిషి స్పీడ్ గా వచ్చి మొహంపైనా అలాగే తల భాగంలో పిడి గుద్దులు కురిపించాడు. ఆ తరువాత పెడ నీళ్లను పోసి పారిపోయాడు. కావాలనే నా మీద ఈ  విధంగా దాడి చేశారు' అని ప్రియానందన్ మాట్లాడారు. 

అంతే కాకుండా ఖచ్చితంగా ఇది బీజేపీ - ఆరెస్సెస్ వేసిన ప్లాన్ అని అంటూ తనను మానసికంగా తెబ్బతీయడానికి ఈ విధంగా దాడి చేసినట్లు చెప్పారు. ఈ విషయంపై దర్శకుడు పోలీసులను ఆశ్రయించారు. ఇటీవల ప్రియనందన్ శబరిమల వివాదంపై ఫెస్ బుక్ లో ఒక పోస్ట్ చేశారు. ఆయన వివరణ ఇచ్చిన కొన్నిరోజులకే ఈ ఘటన చోటుచేసుకోవడంతో పలువురు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు.