Harsh Roshan- Sridevi:  కోర్ట్‌ సినిమాలో భారీ విజయాన్ని అందుకుంది యువ జంట శ్రీదేవి–రోషన్. ఈ జంట మరోసారి కలిసి సందడి చేయబోతున్నారు. కోన వెంకట్ నిర్మాణంలో “బ్యాండ్ మేళం” కోసం రియూన్ అయ్యారు. ఇంతకీ ఆ సినిమా ఏంటీ?

Harsh Roshan - Sridevi: నేచురల్ స్టార్ నాని నిర్మాతగా వ్యవహరించిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ 'కోర్ట్‌'. ఈ సినిమాలో ప్రియ‌ద‌ర్శి, హ‌ర్ష్ రోష‌న్‌, శ్రీదేవి కీలక పాత్రల్లో నటించారు. రామ్ జగదీష్ తెరకెక్కించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించింది. ఈ సినిమా సక్సెస్ తో డైరెక్టర్ కే కాదు. ఇందులో నటించిన యువ జంట హ‌ర్ష్ రోష‌న్‌, శ్రీదేవి కూడా మంచి పేరు వచ్చింది. వీరి తొలి మూవీతోనే తమ యాక్టింగ్ తో మెప్పించారు. తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు పొందారు. ఈ యువ జంట మరోసారి కలిసి నటించబోతున్నారంట. ఇంతకీ సినిమా ఏంటీ? ఆ అప్డేట్స్ ఏంటో ఓ లూక్కేయండి.

కోర్టు మూవీ ఫేమ్ 

కోర్ట్ మూవీతో టాలీవుడ్ కు పరిచయం అయింది యువ జంట శ్రీదేవి, రోషన్. తొలి మూవీతోనే తమ యాక్టింగ్ తో మెప్పించింది ఈ జంట. 2025లో విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచింది. ఈ చిత్రానికి రామ్ జగదీష్ దర్శకత్వం వహించారు. ఈ మూవీని వాల్ పోస్టర్ సినిమా ద్వారా నేచురల్ స్టార్ నాని సమర్పించారు. ఈ చిత్రంలో ప్రియదర్శి, సాయి కుమార్, శివాజీ, రోహిణి, హర్ష వర్ధన్, శుభలేఖ సుధాకర్ ముఖ్య పాత్రల్లో నటించారు. ముఖ్యంగా ఈ మూవీలో వెన్నెల, చందుల కెమిస్ట్రీ యూత్ ను ఆకట్టుకుంది. ఈ మూవీలోని ‘తప్పులేదు ప్రేమలో’ అనే సాంగ్ బ్లాక్ బస్టర్ ఆల్బమ్ గా నిలిచింది.

మరోసారి యువ జంట కలయిక

అయితే తాజాగా మరోసారి ఈ జంట సిల్వర్ స్క్రీన్ పై సందడి చేసేందుకు సిద్ధమైంది. ఈ విషయాన్ని హీరోయిన్ శ్రీదేవి, హీరో రోషన్ తన ఇన్ స్టా అకౌంట్ లో పోస్టు చేశారు. ఈ చిత్రాన్ని కోన వెంకట్ నిర్మాణంలో తెరకెక్కిస్తున్నారు. ఇందుకు సంబంధించిన గ్లింప్స్ ను ఇన్ స్టా లో షేర్ చేశారు. ఈ మూవీకి బ్యాండ్ మేళం అని పేరును పరిశీలిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది.

View post on Instagram

సపోర్ట్ కావాలంటున్న యువ జంట

ఈ మూవీకి సంబంధించిన పూర్తి వివరాలను సెప్టెంబర్ 17 ఉదయం 9:45 నిమిషాలకు ప్రకటించనున్నట్లు తెలిపారు. మీ సపోర్ట్ కావాలి అంటూ శ్రీదేవి, రోహన్ ఈ పోస్టును షేర్ చేశారు. దీనిపై నెటిజెన్లు స్పందిస్తూ కంగ్రాట్స్ చెబుతున్నారు. కోర్టు మూవీ మాదిరి మరోసారి మ్యాజిక్ చేయాలని కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఇటీవల ఈ యువ జంట గామా అవార్డ్స్ ఫంక్షన్ లో సందడి చేసిన విషయం తెలిసిందే.