కబాలి - కాలా దర్శకుడికి న్యాయస్థానం కౌంటర్ ఇచ్చింది. రాజరాజచోళన్‌ గురించి మాట్లాడి చిక్కుల్లో ఇరుక్కున్న పా.రంజిత్ పై న్యాయమూర్తి అసహనం వ్యక్తం చేశారు. అరెస్ట్ చేయాలనీ ఆర్డర్ రాకముందే మధురై కోర్టులో ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ వేసిన రంజిత్ కు చేదు అనుభవమే ఎదురైంది. 

అసలు వివరాల్లోకి వెళితే.. ఇటీవల  కుంభకోణం, తిరుప్పనంద గ్రామంలో  దళిత సంఘం నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిధిగా వెళ్లిన రంజిత్ ఊహించని విధంగా రాజరాజ చోళన్‌ గురించి అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు వెలువడ్డాయి. సినీ ప్రముఖులు సైతం వ్యతిరేఖించారు. 

పరిస్థితి  విషమించకముందే వెంటనే పోలీసులు రంజిత్ పై మతకలహాలు రేకెత్తించడం అలాగే శాంతి భద్రతలు భంగం కలిగించడం వంటి కేసులు నమోదు చేశారు. పోలీసులు అరెస్ట్ చేయడానికి సిద్ధం కాగా ముందస్తు బెయిల్ కోసం మధురై కోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన న్యాయవాదులు పా.రంజిత్ కు మొట్టికాయలు వేశారు. అయితే రంజిత్ వివరణ ఇస్తూ.. తాను చరిత్ర గురించి మాట్లాడానని అయితే ఇంటర్నెట్ లో కొంతమంది కావాలని తన మాటలను వక్రీకరించినట్లు చెప్పాడు. 

దీంతో మాట్లాడటానికి మరో విషయమే దొరకలేదా? మాట్లాడటానికి అందరూ గొప్పగా చూసుకునే వ్యక్తుల మీదే ఇలా మాట్లాడాలా? అంటూ కోర్టు అతనికి అక్షింతలు చల్లింది. అదే విధంగా కేసు పిటిషన్ ను 19వ తారీకు కోర్టులో దాఖలు చేయాలనీ అప్పటివరకు పా.రంజిత్ ని అరెస్ట్ చేయవద్దని న్యామూర్తి వివరణ ఇచ్చారు.