‘సలార్’:ప్రభాస్ హెయిర్ స్టైల్.. యమా కాస్ట్లీ!
ప్రభాస్ గురించి మరో ఇంట్రెస్టింగ్ విషయం కూడా బయిటకు వచ్చింది. అది ప్రభాస్ తాజా చిత్రం సలార్ లో హెయిర్ స్టైయిల్ కోసం ఎంత ఖర్చు పెడుతున్నారనేది. ఆ మొత్తం ఎంతో తెలుస్తే ఆశ్చర్యంపోతాం. అసలు హెయిర్ స్టైల్ కు అంత ఖర్చు పెడతారా అని షాకైపోతాం.
ప్రభాస్ వంటి స్టార్ హీరోకు సంబంధించిన విశేషాలు తెలుసుకునేందుకు అభిమానులు ఎప్పుడూ ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే ప్రభాస్ రెమ్యూనరేషన్ ఒక హాట్ టాపిక్ గా మారింది. ప్రభాస్ గురించి మరో ఇంట్రెస్టింగ్ విషయం కూడా బయిటకు వచ్చింది. అది ప్రభాస్ తాజా చిత్రం సలార్ లో హెయిర్ స్టైయిల్ కోసం ఎంత ఖర్చు పెడుతున్నారనేది. ఆ మొత్తం ఎంతో తెలుస్తే ఆశ్చర్యంపోతాం. అసలు హెయిర్ స్టైల్ కు అంత ఖర్చు పెడతారా అని షాకైపోతాం.
అందుతున్న సమాచారం మేరకు సలార్ లో ప్రభాస్ హెయిర్ స్టైల్ కోసం బాలీవుడ్ టాప్ హెయిర్ స్టైలిస్ట్ రంగంలోకి దిగారట. ఈ స్పెషల్ హెయిర్ స్టైల్ నిమిత్తం నాలుగు లక్షలు ఖర్చుపెడుతున్నారని సమాచారం. ఇంతకుముందు 'సాహో' లో ప్రభాస్ హయిర్ స్టైల్ కు మంచి అప్లాజ్ వచ్చింది. అప్పుడు ప్రభాస్ సూపర్ స్టైలిష్ గా బాలీవుడ్ హీరో తరహాలో కనిపిస్తున్నాడంటే అందుకు హెయిర్ స్టైల్ కూడా ఒక కారణం. అప్పుడు ప్రభాస్ హెయిర్ స్టైలింగ్ చేసినవారు ఎవరో తెలుసా? ఇండియాలోనే ప్రముఖ హెయిర్ స్టైలిస్ట్ ఆలిమ్ హకీమ్. ప్రభాస్ కు ఈ సినిమా కోసమే కాదు.. 'మిర్చి' సినిమా చేసిన సమయం నుండి ఆయనే హెయిర్ స్టైలింగ్ చేస్తున్నారట. ఈయన ఒకసారి హెయిర్ కట్ చేస్తే రూ. 2నుండి 4 లక్షల వరకూ ఛార్జ్ చేస్తారట. ఇప్పుడు కూడా ఆయన చేతే చేయిస్తున్నాడంటున్నారు.
‘బాహుబలి’, ‘సాహో’ చిత్రాలతో పాన్ ఇండియా స్టార్‌గా మారిన ప్రభాస్ కు ‘సలార్’ నెక్ట్స్ లెవిల్ ఫిల్మ్. ‘కె.జి.ఎఫ్’తో దర్శకుడు ప్రశాంత్ నీల్, నిర్మాత విజయ్ కిరంగందూర్ జాతీయ స్థాయిలో గుర్తింపుని సొంతం చేసుకున్నారు. ఈ ముగ్గురి కలయికలో రూపొందనున్న మరో పాన్ ఇండియా చిత్రమే... ‘సలార్’. ఇక ఈ చిత్రం షూటింగ్ త్వరలోనే హైదరాబాద్ లోని రామోజీ ఫిలిం సిటీలో వేసిన భారీ సెట్ లో మొదలు కాబోతుంది. ఇప్పటికే గోదావరి ఖని బొగ్గు గనుల్లో ఓ షెడ్యూల్ పూర్తి చేసుకున్న సలార్.. ఇకపై ఫిలిం సిటీలోని స్పెషల్ సెట్ లో మొదలు కాబోతుంది. “కేజీఎఫ్” చిత్రాలకు తనతో వర్క్ చేసిన టెక్నీషియన్లనే ఆయన ప్రభాస్ సినిమాకి కూడా రిపీట్ చేస్తున్నాడు.
హొంబెల్ ఫిల్మ్స్ పతాకంపై ఈ సినిమా రూపుదిద్దుకోనుంది. కేజీఎఫ్, కేజీఎఫ్ 2ను నిర్మించిన విజయ్ కిరుగందుర్ ఈ సినిమాను నిర్మించనున్నారు. కేజీఎఫ్ ఫ్రాంచైజ్ వెనుక ఉన్న హోంబాలే చిత్రాలు ఈ చిత్రాన్ని బ్యాంక్రోలింగ్ చేస్తున్నాయి.