కరోన మహమ్మారి బాలీవుడ్‌ సినీ ప్రముఖులను కలవరపెడుతోంది. సింగర్‌ కనికా కపూర్‌తో మొదలైన హడావిడి.. ప్రముఖులకు చెమటలు పట్టిస్తోంది. ఇప్పటికే బోనీ కపూర్‌, కరణ్‌ జోహార్‌ లాంటి వారి ఇళ్లలో కూడా కరోన కేసులు నమోదయ్యాయి. అయితే వారి పనివారికి మాత్రమే కరోనా సోకగా కుటుంబ సభ్యులంతా సురక్షితంగానే ఉన్నారు. తాజాగా మిస్టర్‌ పర్ఫెక్షనిస్ట్ ఆమిర్‌ ఖాన్‌ ఇంట్లోనే కరోన కేసులు నమోదయ్యాయి. ఈ విషయాన్ని ఆమిర్‌ స్వయంగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు.

`మా ఇంట్లోని పనిచేసే స్టాఫ్‌కు కరోనా పాజిటివ్‌ అని నిర్థారణ అయ్యింది. వారిని వెంటనే క్వారెంటైన్‌  చేశాం. తరువాత ముంబై మున్సిపల్‌ అధికారులు వారిని తీసుకెళ్లి కావాల్సిన మెడికల్‌ ఫెసిలిటీస్‌ అందించారు. ఈ సందర్భంగా వారి పట్ల మంచి కేర్‌ తీసుకున్నందుకు, అదే సమయంలో పరిసరాలను వెంటనే స్టెరిలైజ్‌ చేసినందుకు ముంబై కార్పోరేషన్‌ అధికారులకు కృతజ్ఞతలు.

ఇంట్లో ఉంటున్న మిగతావారికి టెస్ట్‌లు జరిపించాం. అందరికీ నెగెటివ్ వచ్చింది. ప్రస్తుతం మా అమ్మకు టెస్ట్‌ చేయించాల్సి ఉంది. ఇంట్లో ఆమె ఒక్కరికే టెస్ట్ చేయించాల్సి ఉంది. ఆమెకు కూడా నెగెటివ్‌ రావాలని ప్రార్థించండి. సరైన సమయంలో స్పందించి, సరైన కేర్‌ తీసుకున్నందుకు గానూ బీఎంసీ అధికారులకు మరోసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. కోకిలాబెన్‌ హాస్పిటల్‌ డాక్టర్లు, నర్సులు, ఇతర స్టాఫ్ అందరికీ కృతజ్ఞతలు` అంటూ ఓ లెటర్‌ను పోస్ట్ చేశాడు ఆమిర్‌.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Aamir Khan (@_aamirkhan) on Jun 29, 2020 at 11:21pm PDT