Asianet News TeluguAsianet News Telugu

బండ్ల గణేష్ ని చావు దెబ్బ కొట్టిన కరోనా.. గోలెత్తిపోతున్నాడు!

ఒక టైమ్ లో టాలీవుడ్ లో ఓ వెలుగు వెలిగిన బండ్ల గణేష్ పరిస్దితి ఈ మధ్యన ఏమీ బాగోలేదు. ఎంతో ఉత్సాహంతో కాంగ్రేస్ కండువా కప్పుకుని రాజకీయాల్లోకి వెళితే అక్కడా నడవలేదు. ఆ తర్వాత కెరీర్ ని తిరిగి ప్రారంభిద్దామని రీసెంట్ గా వచ్చిన సరిలేరు నీకెవ్వరూ సినిమాలో ఓ పాత్ర చేస్తే అది క్లిక్ అవ్వలేదు. 

corona virus effect on Bandla Ganesh poutry business
Author
Hyderabad, First Published Mar 7, 2020, 7:46 AM IST

ఈ మధ్యన బండ్ల గణేష్ పరిస్దితి ఏమీ బాగోలేదు. ఎంతో ఉత్సాహంతో కాంగ్రేస్ కండువా కప్పుకుని రాజకీయాల్లోకి వెళితే అక్కడా నడవలేదు. ఆ తర్వాత కెరీర్ ని తిరిగి ప్రారంభిద్దామని రీసెంట్ గా వచ్చిన సరిలేరు నీకెవ్వరూ సినిమాలో ఓ పాత్ర చేస్తే అది క్లిక్ అవ్వలేదు. ఇప్పుడు మళ్లీ నిర్మాతగా సినిమాలు ప్రారంభిద్దామా అనే ఆలోచలు చేస్తున్న సమయంలో కరోనా పెద్ద దెబ్బ కొట్టిందని వినపడుతోంది. ఆయనకు ఆర్దికంగా వెన్నుదన్నుగా ఉన్న పౌల్ట్రీ పరిశ్రమ ని కరోనా చావు దెబ్బ కొట్టింది.

వివరాల్లోకి వెళితే...చైనాలో మొదలైన కరోనా వైరస్‌ ఆంధ్రప్రదేశ్‌లో కోళ్ల పరిశ్రమను అతాలకుతలాం చేయటం మొదలెట్టింది. కరోనా వైరస్ రూమర్స్ తో రోజురోజుకు చికెన్ ధరలు పడిపోతున్నాయి. గత ఇరవై రోజుల నుంచి అమాంతం తగ్గుతూ వస్తూ ఫౌల్డ్రీ అధినేతల గుండెళ్లో కోళ్లు పరుగెడుతున్నాయి. ముఖ్యంగా కరోనా ఎఫెక్ట్ వల్ల చికెన్ కంటే రైతు బజారులో కూరగాయల ధరలే ఎక్కువగా ఉంటున్నాయ్. ఈ నేపధ్యంలో పౌల్ట్రీ పరిశ్రమ భవిష్యత్‌ అగమ్యగోచరంగా తయారైంది. సరిగ్గా నెల రోజుల క్రితం కిలో చికెన్ 2 వందల రూపాయలు ఉండేది. ప్రస్తుతం సగం కంటే తక్కువ ధరకే పడిపోయింది. చికెన్ తింటే కరోనా వస్తుందనే భయమే జనాన్ని వెంటాడుతోంది. దీనిపై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంతో ప్రజలు నాన్ వెజ్‌కు దూరంగా ఉంటున్నారు.

  బండ్ల గణేష్‌ తెలంగాణలో పేరు మోసిన ఫౌల్ట్రీ వ్యాపారి. షాద్‌నగర్‌లో బండ్ల గణేష్ కు కోళ్ల ఫారమ్స్ ఉన్నాయి. సినిమాలు లేనపుడు ఆయన అక్కడే ఆ వ్యాపారం చూసుకుంటూంటారు. ఎన్నో ఏళ్లుగా గుడ్లు, కోళ్ల వ్యాపారం చేస్తున్నాడు ఈయన. అంతెందుకు తెలంగాణలో గుడ్ల ధరను నిర్ణయించే అతికొద్ది మంది బిజినెస్ మెన్స్‌లో బండ్ల గణేష్ కూడా ఒకరు. ఈ స్దాయిలో  బిజినెస్ చేస్తున్న ఆయన  ఇప్పుడు కరోనా దెబ్బకు విలవిలలాడుతున్నారు. త్వరలోనే అన్నీ సర్దుకుంటాయని చెబుతున్నా పరిస్దితి మెరుగుపడటం లేదు.

చికెన్ తింటే వైరస్ సోకుతుందనే వదంతులు నమ్మవద్దని డాక్టర్లు చెబుతున్నా ఎవరూ వినటం లేదు. కరోనా వైరస్ అతి శీతల వాతావరణంలో మాత్రమే వ్యాప్తిచెందుతుందని చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో 30 డిగ్రీలకు పైబడిన ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్న విషయాన్ని కూడా గుర్తించాలని కోరుతున్నారు. కోళ్లకు ఎలాంటి వైరస్ సోకదని స్పష్టం చేస్తున్నారు. సోషల్ మీడియాలో వస్తున్న రూమర్స్ ని నమ్మవద్దంటూ హితవు పలుకుతున్నారు. అయినా భయం ..వీటినన్నటినీ డామినేట్ చేస్తోంది. తద్వారా చికెన్ వ్యాపారులకు తీవ్ర నష్టం ఏర్పడుతోంది. మొత్తానికి కరోనా వైరస్‌ దెబ్బ ఫౌల్ట్రీ రంగానికి,దాన్ని నమ్ముకున్న బండ్ల గణేష్ లాంటి వారికి గట్టిగానే తగులుతోంది. 

Follow Us:
Download App:
  • android
  • ios