కరోనా కారణంగా `వకీల్‌సాబ్‌` ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కి ముందుగా అనుమతివ్వలేదు పోలీస్‌ అధికారులు. ఎట్టకేలకు అనేక నిబంధనలతో గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. ఇంత వరకు బాగానే ఉంది. కానీ ఇందులో నటించిన నివేదా థామస్‌కి కరోనా పాజిటివ్‌ రావడం ఇప్పుడు చిత్ర బృందాన్ని ఆందోళనకి గురి చేస్తుంది. 

పవన్‌ రీఎంట్రీ చిత్రం `వకీల్‌సాబ్‌` అన్ని అడ్డంకులను దాటుకుని విడుదలకు సిద్ధమయ్యింది. ఈ రోజు(ఆదివారం) రాత్రి హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో ఈ చిత్ర ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ జరుగుతుంది. ఈ నెల 9న సినిమా విడుదల కానుంది. కరోనా కారణంగా ఈ చిత్ర ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కి ముందుగా అనుమతివ్వలేదు పోలీస్‌ అధికారులు. ఎట్టకేలకు అనేక నిబంధనలతో గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. ఇంత వరకు బాగానే ఉంది. కానీ ఇందులో నటించిన నివేదా థామస్‌కి కరోనా పాజిటివ్‌ రావడం ఇప్పుడు చిత్ర బృందాన్ని ఆందోళనకి గురి చేస్తుంది. 

నివేదా థామస్‌కి శనివారం కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో ఆమె హోం క్వారంటైన్‌ అయిపోయారు. తాను హాజరు కావాల్సిన ప్రెస్‌మీట్‌లు కూడా క్యాన్సిల్‌ చేసుకున్నారు. అయితే ఇటీవల వీరంతా ఫైనల్‌ మిక్సింగ్‌ కోసం కలిశారు. దర్శకుడు వేణు శ్రీరామ్‌, కీలక పాత్రల్లో నటిస్తున్న అంజలి, నివేదా, అనన్య నాగళ్ల ఈ మిక్సింగ్‌లో పాల్గొన్నారు. ఈ విషయాన్ని చిత్ర బృందం అధికారికంగా వెల్లడించారు. ట్విట్టర్‌ ద్వారా దర్శక, నిర్మాతలు తెలిపారు. మూడు రోజులు ముందే వీరంతా కలవడంతో, మిగిలిన వారిలో కూడా కరోనా భయం నెలకొంది. 

Scroll to load tweet…

సినిమా విడుదలకు ముందు ఇదేం ట్విస్ట్ అని చిత్ర యూనిట్‌ టెన్షన్‌ పడుతున్నట్టు టాక్‌. కరోనా నిర్ధారణ కావడానికి దాదాపు పది రోజుల సమయం తీసుకుంటుంది. ఆ లోపు వీళ్లు ఎవరెవరిని కలిశారు, ఎవరికి కరోనా సోకుతుందో అనే ఆందోళన యూనిట్‌లో నెలకొన్నట్టు టాక్‌.