బిగ్‌బాస్‌ నాల్గో సీజన్‌ శుక్రవారం బిగ్‌బాస్‌ కెప్టెన్సీ టాస్క్ తప్ప మరేది ఇవ్వకుండా లాగించేశాడు. జనరల్‌గా ఓ టాస్క్‌ ఇచ్చి ఇంటిసభ్యులకు గేమ్‌ పెడతాడు బిగ్‌బాస్‌. కానీ ఈ శుక్రవారం టాస్క్ లేమీ ఇవ్వలేదు. కుక్‌ చేయడం, ఇంట్లో గొడవలతో టైమ్‌ పాస్‌ చేయించాడు. నిజానికి టాస్క్ లు ఏమీ లేక ఇలా గొడవలను హైలైట్‌గా చేసినట్టుగా ఉంది. 

కెప్టెన్‌ అయ్యాక ఇంటిసభ్యులకు పనులు కేటాయించడం కామన్‌. కెప్టెన్‌ చెప్పిన మాటని విని చేయాల్సిందే. ఈ పని విభజనలో తేడా వస్తే గొడవలు వస్తుంటాయి. కానీ శుక్రవారం జరిగినంత రేంజ్‌లో ఎప్పుడూ జరగలేదు. అమ్మా రాజశేఖర్‌ కెప్టెన్‌ అయ్యాక ఇంటి పనులు కేటాయించినప్పుడు హారిక, అభిజిత్‌, సోహైల్‌, అఖిల్‌ అభ్యంతరాలు వ్యక్తంచేశారు. 

కెప్టెన్‌గా నేను ఏం చెబితే అది చేయాలన్నారు. రెండు రోజులు చూశాక వారి పనిని మార్చేస్తా అన్నాడు. దీనిపైనే చాలా సేపు డిస్కషన్‌ జరిగింది. మెహబూబ్‌, సోహైల్‌ మధ్య సైతం ఇదే డిస్కషన్‌ వచ్చింది. అయితే ఈ మధ్య మెహబూబ్‌, సోహైల్‌ మధ్య మనస్పర్థాలు తలెత్తినట్టుంది. అది శుక్రవారం బయటపడ్డాయి. పనులు చర్చించుకునే క్రమంలో సోహైల్‌ని ఉద్దేశించి `నువ్వు వద్దు.. నీ ఫ్రెండ్‌షిప్‌ వద్దు ` అని మెహబూబ్‌ అన్నాడు. దీంతో అంతెత్తుగా లేచాడు సోహైల్‌ తన వద్ద ఉన్న డ్రై ఫ్రూట్స్ ని నేలకు కొట్టి వెళ్ళిపోయాడు. ఇది ఇంట్లో హీటుని పెంచింది. అమ్మా రాజవేఖర్‌ సర్ధి చెప్పాడు. ఇంట్లో ఏం జరుగుతుందో ఏమో అని అభిజిత్‌ అన్నాడు.