కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ తండ్రి మరో వివాదంతో వార్తల్లో నిలిచారు. కోలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరైన విజయ్ ఫ్యామిలీని గత కొన్నాళ్లుగా వివాదాలు చుట్టుముడుతున్నాయి. ఇక ఇప్పుడు ముగిసిపోయింది అనుకున్న ఒక ఫైనాన్షియల్ ఇష్యు లో విజయ్ తండ్రి చంద్రశేఖర్ ఇరుక్కున్నారు. ఒక సినిమా హక్కుల విషయంలో చంద్రశేఖర్‌పై కమిషనర్‌ కార్యాలయంలో నగదు మోసం కింద కేసు నమోదైంది.

తమిళ చిత్ర నిర్మాత మణిమారన్‌  ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. చంద్రశేఖర్‌ తెరకెక్కించిన ట్రాఫిక్‌ రామస్వామి సినిమా తమిళనాడు విడుదల హక్కులను బ్రహ్మానందం బ్రహ్మానందం అనే వ్యక్తికి ఇస్తున్నట్లు రూ.21 లక్షలు అడ్వాన్సు తీసుకున్నరని, అయితే కొన్ని రోజుల అనంతరం సొంతంగా సినిమాను విడుదల చేస్తానని చెప్పిన చంద్రశేఖర్ సినిమా విడుదలై ఏడాది పూర్తయిన బ్రహ్మానందం నుంచి తీసుకున్న డబ్బులు తనకు ఇవ్వలేద మణిమారన్‌ ఫిర్యాదు చేశారు.

ఇక ఈ విషయంపై బ్రహ్మానందంతో ఫోన్ లో మాట్లాడగా మూడు నెలల్లో డబ్బు ఇస్తానని చెప్పిన చంద్రశేఖర్ పట్టించుకోవడం లేదని గడువు ముగిసిన తరువాత బెదిరింపు చర్యలకు పాల్పడుతున్నట్లు మణిమారన్‌ వివరణ ఇచ్చారు. ఇక ఈ విషయం కోలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ఈ విషయంపై చంద్రశేఖర్  స్పందించాల్సి ఉంది.