ప్రముఖ హాస్య నటుడు రాజు శ్రీవాస్తవ ఆస్పత్రిలో చేరారు. జిమ్‌లో వ్యాయామం చేస్తున్న సమయంలో గుండెపోటు రావడంతో.. ఆయనను ఢిల్లీలోకి ఎయిమ్స్ ఆస్పత్రికి తరలించారు.
ప్రముఖ హాస్య నటుడు రాజు శ్రీవాస్తవ ఆస్పత్రిలో చేరారు. జిమ్‌లో వ్యాయామం చేస్తున్న సమయంలో గుండెపోటు రావడంతో.. ఆయనను ఢిల్లీలోకి ఎయిమ్స్ ఆస్పత్రికి తరలించారు. బుధవారం సౌత్ ఢిల్లీలోకి ఓ జిమ్‌లో రాజు శ్రీవాస్తవ.. ట్రెడ్‌మిల్‌పై పరిగెత్తుతుండగా కుప్పకూలిపోయారు. దీంతో వెంటనే అక్కడివారు ఆయనను ఢిల్లీలోని ఎయిమ్స్‌కు తరలించారు. అయితే ప్రస్తుతం ఆయన స్పృహలోని ఉన్నట్టుగా రాజు శ్రీవాస్త స్టాఫ్ చెప్పినట్టుగా ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్ పేర్కొంది. అయితే ఆయనను రెండు రోజుల పాటు వైద్యుల పరిశీలనలో ఉంచనున్నట్టుగా తెలుస్తోంది.
ప్రస్తుతం డాక్టర్ నితీష్ న్యాయ్ నేతృత్వంలోని కార్డియాలజీ అండ్ ఎమర్జెన్సీ విభాగానికి చెందిన ఎయిమ్స్ వైద్యుల బృందం.. రాజు శ్రీవాస్తవకు ట్రీట్‌మెంట్ అందిస్తోంది. ఎయిమ్స్ వర్గాల సమాచారం ప్రకారం.. శ్రీవాస్తవ జిమ్‌లో వర్కౌట్ చేస్తున్నప్పుడు గుండెపోటుకు గురయ్యారు. ఆయన స్టాఫ్ ఆసుపత్రికి తీసుకువచ్చారు. ఆయనకు రెండుసార్లు CPR ఇవ్వబడింది. ప్రస్తుతం ఆయన కోలుకున్నాడు.
టీవీ ఇండస్ట్రీలో రాజు శ్రీవాస్తవకు మంచి గుర్తింపు ఉంది. దేశంలోని అత్యంత విజయవంతమైన స్టాండ్-అప్ కమెడియన్‌లలో రాజు శ్రీవాస్తవ కూడా ఒకరు. అనేక మంది రాజకీయ నాయకులను అనుకరించడం ద్వారా రాజు శ్రీవాస్తవ ప్రజాదరణ పొందారు.
