కమెడియన్ అలీ దశాబ్దాలుగా చిత్ర పరిశ్రమలో కొనసాగుతూ తన హాస్యంతో నవ్వులు పూయిస్తున్నారు. హోస్ట్ గా కూడా మారి కొన్ని ప్రోగ్రామ్స్ చేస్తున్నారు. వివాదాలకు దూరంగా ఉంటూ నటుడిగా తన పని తానూ చేసుకుని వెళ్లే అలీ 2019 సార్వత్రిక ఎన్నికల సమయంలో వైసిపి కండువా కప్పుకున్న సంగతి తెలిసిందే.
కమెడియన్ అలీ దశాబ్దాలుగా చిత్ర పరిశ్రమలో కొనసాగుతూ తన హాస్యంతో నవ్వులు పూయిస్తున్నారు. హోస్ట్ గా కూడా మారి కొన్ని ప్రోగ్రామ్స్ చేస్తున్నారు. వివాదాలకు దూరంగా ఉంటూ నటుడిగా తన పని తానూ చేసుకుని వెళ్లే అలీ 2019 సార్వత్రిక ఎన్నికల సమయంలో వైసిపి కండువా కప్పుకున్న సంగతి తెలిసిందే. ఆ ఎన్నికల్లో అలీ వైసిపి తరుపున ప్రచారం కూడా చేశారు.
అప్పటి నుంచి వైసీపీలో అలీ కొనసాగుతున్నారు. చాలా రోజులుగా అలికి సీఎం జగన్ కీలక పదవి ఇవ్వబోతున్నారు అంటూ ప్రచారం జరుగుతూ వచ్చింది. అలికి మంత్రి పదవి లేదా రాజ్యసభ ఎంపీ సీటు ఇచ్చే అవకాశాలు ఉన్నట్లు ఊహాగానాలు వినిపించాయి.
ఎట్టకేలకు అలీకి కీలక పదవి దక్కింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుడిగా అలీని నియమిస్తూ సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఆదేశాలు కూడా జారీ చేశారు.
జగన్ తనకి ఈ బాధ్యత అపప్పగించడంతో అలీ సంతోషంలో ఉన్నారు. తన స్పందన తెలియజేశారు. తాను జగన్ అడుగు జాడల్లో నడుస్తానని తెలిపారు. తాను పార్టీ కోసం నిబద్దతతో పనిచేశానని అలీ అన్నారు. కానీ ఎప్పుడూ పదవి ఆశించలేదు.
సీఎం జగన్ నా పనిని గుర్తించి, తాను పార్టీకి ఉపయోగపడ్డానని భావించి ఈ పదవి ఇచ్చారు. తనకిచ్చిన బాధ్యతని సక్రమంగా నిర్వహిస్తానని అలీ అన్నారు. జగన్ కి కృతజ్ఞతలు చెబుతూ.. నా కుమార్తె పెళ్లి సందర్భంగా జగన్ ఇచ్చిన గిఫ్ట్ గా ఈ పదవిని భావిస్తానని అలీ తెలిపారు. ఇటీవల అలీ పెద్ద కుమార్తె ఫాతిమా నిశ్చితార్థం జరిగింది. త్వరలో వివాహ వేడుక కూడా జరగనుంది.
