రీసెంట్ గా 'సమ్మోహనం', ' నన్ను దోచుకుందువటే' వంటి సినిమాలతో మంచి గుర్తింపు సంపాదించుకున్న హీరో సుధీర్ బాబుకి ఇప్పటివరకు సరైన హిట్టు సినిమా మాత్రం పడలేదనే చెప్పాలి. ఈ ఏడాది ఆగస్ట్ లో సుధీర్ బాబు.. రిజ్వాన్ అనే నిర్మాతతో ఓ సినిమా చేయడానికి కమిట్ అయ్యాడు.

సినిమా పూజా కార్యక్రమాలు కూడా నిర్వహించారు. మెహ్రీన్ ని హీరోయిన్ గా ఎంపిక చేశారు. ఈ సినిమా పులి వాసు అనే దర్శకుడు పరిచయం కావాల్సివుంది. కానీ ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ ఆగిపోయిందని తెలుస్తోంది.

నిర్మాతకి సుధీర్ బాబుకి మధ్య గొడవ జరగడంతో సుధీర్ బాబు ఈ సినిమా నుండి తప్పుకోవాలని నిర్ణయించుకున్నాడు. అడ్వాన్స్ గా తీసుకున్న పాతిక లక్షల రెమ్యునరేషన్ ని కూడా తిరిగి ఇచ్చేసినట్లు సమాచారం. ప్రస్తుతానికైతే సినిమాని క్యాన్సిల్ చేసేశారు.

దీంతో సుధీర్ బాబు పుల్లెల గోపీచంద్ బయోపిక్ లో నటించబోతున్నాడు. ప్రస్తుతానికి సినిమా ప్రీప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. మరోపక్క నిర్మాత రిజ్వాన్ హీరో శ్రీవిష్ణుతో సినిమా చేయడానికి సిద్ధమవుతున్నాడు.