సన్ పిక్చర్స్ సంస్థ వైస్ చైర్మన్, పవన్ కళ్యాణ్ తో కాసేపు చర్చలు జరిపారని చెప్తున్నారు. ఆ చర్చలు కొత్త సినిమాకి సంబంధించినదే అని అంటున్నారు.
కారణం ఏదైతేనేం పవన్ కళ్యాణ్ వరస పెట్టి సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో రకరకాల వార్తలు రూమర్స్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. రకరకాల కాంబినేషన్స్ తెరపైకి వస్తున్నాయి. ఫ్యాన్స్ ఈ వరస వార్తలతో ఉక్కిరిబిక్కిరి అయ్యిపోతున్నారు. ఇప్పటికే పవన్ చేతిలో ఇప్పుడు నాలుగు సినిమాలు ఉన్నాయి. అందులో ‘బ్రో’ అనే సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తి కాగా, #OG మూవీ షూటింగ్ శరవేగంగా సాగుతుంది. ఈ సినిమాలతో పాటుగా ఆయన హరీష్ శంకర్ తో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మరియు క్రిష్ తో ‘హరి హర వీరమల్లు’ సినిమా చేస్తున్నాడు. ఇప్పుడు మరో సినిమా కమిటయ్యాడంటూ వార్తలు వచ్చాయి.
తమిళంలో నెంబర్ వన్ నిర్మాణ సంస్ద...సన్ పిక్చర్స్ సంస్థ త్వరలోనే పవన్ తో తెలుగు లో ఒక సినిమా చేయబోతుందని ఆ వార్తల సారాంశం. రీసెంట్ గానే పవన్ కళ్యాణ్ #OG మూవీ సెట్స్ కి విచ్చేసిన సన్ పిక్చర్స్ సంస్థ వైస్ చైర్మన్, పవన్ కళ్యాణ్ తో కాసేపు చర్చలు జరిపారని చెప్తున్నారు. ఆ చర్చలు కొత్త సినిమాకి సంబంధించినదే అని అంటున్నారు. అలాగే పవన్ తో సినిమా చేయాలని ఉత్సాహం చూపెడుతున్న ఆ డైరక్టర్ కూడా మామూలో డు కాదు.
‘మాస్టర్’, ‘ఖైదీ’ మరియు ‘విక్రమ్’ వంటి సినిమాలతో బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ తో దుమ్మురేపిన డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ . నిజమే అయితే మామూలుగా ఉండదు కదా. ఇంకేంటి అంటారా..అయితే ఇక్కడ కొన్ని విషయాలు మాట్లాడుకోవాలి. ప్రస్తుతం ఉన్న పరిస్దితుల్లో పవన్ ..30 రోజులు మించి ఓ సినిమాకు డేట్స్ ఇచ్చేలా లేరు. అలాగే ప్రస్తుతం లోకేష్ తమిళ స్టార్ హీరో విజయ్ తో ‘లియో’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రం పూర్తి అవ్వగానే రజినీకాంత్ తో మరో సినిమా చెయ్యబోతున్నాడు. ఈ రెండు సినిమాలు పూర్తి అయినా తర్వాతే పవన్ కళ్యాణ్ – లోకేష్ కాంబినేషన్ లో సినిమా తెరకెక్కే అవకాసం లేదు. అప్పటికి ఎన్ని లెక్కలు మారాతాయో ..ఎవరూ చెప్పలేరు.
మరో ప్రక్క పవన్ చేస్తున్న ‘హరి హర వీరమల్లు’ చిత్రం కూడా 90 శాతం షూటింగ్ మొత్తం పూర్తి చేసుకుంది. క్లైమాక్స్ సన్నివేశానికి సంబంధించిన షూటింగ్ ఒక్కటే బ్యాలన్స్ ఉంది, ఈ షూటింగ్ కోసం వచ్చే నెల నుండి డేట్స్ కేటాయించారని వినికిడి. వీటితో పాటు పవన్ కళ్యాణ్ ఒక క్రేజీ ప్రాజెక్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఊపినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అతనో యంగ్ డైరక్టర్ అంటున్నారు. త్రివిక్రమ్ ఆ ప్రాజెక్టు డీల్ చేస్తున్నట్లు చెప్పుకుంటున్నారు. ఎవరు ఏంటా అనే క్లారిటీ లేదు.
