'జాతి రత్నాలు' డైరక్టర్...నెక్ట్స్ ఏ హీరోతో ? వాళ్లిద్దరూ కాదా
నవీన్ పొలిశెట్టి, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి ప్రధాన పాత్రలలో అనుదీప్ తెరకెక్కించిన ‘జాతి రత్నాలు’ చిత్రం మార్చి 11న విడుదలై బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తున్న సంగతి తెలిసిందే. తొలి నాలుగు రోజుల్లోనే రూ. 34 కోట్ల గ్రాస్ రాబట్టి నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లను లాభాల బాట పట్టించింది. ఇక ఈ సక్సెస్ కు కారణం ...నవీన్ పోలిశెట్టి అద్బుతమైన కామెడీ టైమింగ్ అయితే దర్శకుడు అనుదీప్ వన్ లైనర్స్.

'జాతి రత్నాలు' దర్శకుడికి అది మొదట సినిమాకాదు. పిట్టగోడ అనే సినిమా అంతకు ముందు చేసారు. ఆ సినిమా వర్కవుట్ కాలేదు. ఈ సినిమాతో మంచి విజయం సాధించాడు. దాంతో అందరీ దృష్టీ ఈ డైరక్టర్ నెక్ట్స్ ఏ సినిమా చేయబోతున్నాడనేదానిపై పడింది. ఈ మేరకు మీడియాలో రకరకాల రూమర్స్ మొదలయ్యాయి. ఓ ప్రక్కన రామ్ తో ఆయన ప్రాజెక్టు చేయబోతున్నారని కొందరు, అదేం లేదు ఇక అనుదీప్ తన తర్వాతి చిత్రాన్ని మెగా హీరో వైష్ణవ్ తేజ్‌తో తీస్తున్నారని మరికొందరు తమదైన శైలిలో ప్రచారం చేసేస్తున్నారు.
తొలి సినిమా ‘ఉప్పెన’తోనే సంచలన విజయం సాధించిన వైష్ణవ్… ‘జాతి రత్నాలు’తో ఇండస్ట్రీ హిట్‌ను అందుకున్న అనుదీప్‌తో చేతులు కలపనున్నాడనే వార్త నిజానికి చాలా ఎక్సైటింగ్ కలిగించేదే కానీ అందులో ప్రస్తుతానికి అయితే నిజం లేదని తెలుస్తోంది. అలాగే రామ్ కు కూడా అనుదీప్ కథ చెప్పలేదని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ టీమ్ మొత్తం సక్సెస్ ని ఎంజాయ్ చేస్తూ టూర్ లలో బిజీగా ఉన్నారు.
గురువారం ఉదయం హీరోయిన్ ఫరియాతో కలిసి తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయం బయట మీడియాతో మాట్లాడుతూ శ్రీవారి దర్శనానికి వచ్చేటప్పుడు చక్కెర పొంగలి దొరుకుంతుందా లేదా అనే సందేహంతో తిరుమలకు వచ్చాననీ, కానీ స్వామివారు చక్కెర పొంగలి దక్కేలా చేసి తమని ఆశీర్వదించాడని అన్నాడు. జాతి రత్నాలు సినిమాను బ్లాక్ బస్టర్ చేసిన తెలుగు ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలియజేశారు. థియేటర్లలో జాతి రత్నాలు నవ్వుల పువ్వులు పూయిస్తున్నారన్నారు. స్వామివారి ఆశీస్సులతో విజయోత్సవ యాత్ర ప్రారంభిస్తున్నట్లు తెలిపారు.