తాజాగా క్రియేటివ్ డిఫరెన్స్ లు వచ్చి ప్రాజెక్టు  కు బై చెప్పి వెళ్లిపోయారని సమాచారం. ఆయన త్రివిక్రమ్ తో అంతకు ముందు...


మహేశ్‌ బాబు (Mahesh Babu) హీరోగా దర్శకుడు త్రివిక్రమ్‌ తెరకెక్కిస్తున్న చిత్రం.. ‘గుంటూరు కారం’ (Guntur Kaaram).ఈ చిత్రం ప్రారంభమైన నాటి నుంచి ఏదో ట్విస్ట్ ఎదుర్కొంటూనే ఉంది. తాజాగా ఈ చిత్రం నుంచి టాప్ టెక్నీషియన్ వెళ్లిపోయారని సమాచారం. ఎవరా టెక్నీషియన్ అంటే...

త్రివిక్రమ్ తో అల వైకుంఠపురములో కు పని చేసిన పిఎస్ వినోద్...గుంటూరు కారం చిత్రానికి పని చేస్తున్నారు. ఆయన తాజాగా క్రియేటివ్ డిఫరెన్స్ లు వచ్చి ప్రాజెక్టు కు బై చెప్పి వెళ్లిపోయారని సమాచారం. ఆయన త్రివిక్రమ్ తో అంతకు ముందు అరవింద సమేత వీర రాఘవ చిత్రానికి పని చేసారు. టీమ్ కు ఆయనకు మధ్య ఏం డిఫరెన్స్ లు వచ్చాయనేది బయిటకు రాలేదు. ఇక విఎస్ వినోద్ ప్లేస్ లోకి రవి కే చంద్రన్ వస్తున్నట్లు సమాచారం. 

మహేష్ అభిమానులతో పాటు ప్రేక్షకులు సైతం ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్న సినిమా గుంటూరు కారం. అతడు, ఖలేజా వంటి కల్ట్‌ క్లాసిక్స్ తర్వాత వీళ్ల కాంబోలో తెరకెక్కుతున్న హాట్రిక్ సినిమా కావడంతో అందరిలోనూ ఎక్కడలేని ఎక్సపెక్టేషన్స్ ఈ ప్రాజెక్టు పై ఉన్నాయి. ఈ మధ్య విడుదలైన గ్లింప్స్‌కు ఓ రేంజిలో రెస్పాన్స్‌ వచ్చింది. మహేస్‌ను మాస్‌ యాంగిల్‌లో చూసి చాలా కాలం అయిందని అందరూ మురిసిపోయారు. ఈ సినిమాలో ఊరమాస్‌ క్యారెక్టర్‌ ఉండబోతుందని టీజర్‌తోనే త్రివిక్రమ్‌ క్లారిటీ ఇచ్చాడు.

ఫ్యామిలీ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ సినిమాలో మహేష్‌కు జోడీగా మీనాక్షి చౌదరి, శ్రీలీలలు నటిస్తున్నారు. థమన్ స్వరాలందిస్తున్నాడు. హారికా అండ్ హాసినీ క్రియేషన్స్‌ పతాకంపై ఎస్‌. రాధా కృష్ణ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ‘గుంటూరు కారం’ ప్రకటన వెలువడిన క్షణం నుంచే సినీ అభిమానుల్లో అంచనాలు మొదలయ్యాయి. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 13న ఈ సినిమాని విడుదల చేసేందుకు దర్శక, నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.