జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని మొన్నటి వరకు పెద్దగా ఎవరు పట్టించుకోలేదు. నామినేషన్స్ ప్రక్రియ మొదలుకాగానే అంతా చంద్రబాబు - జగన్ లనే ఎక్కువగా ఫోకస్ చేశారు. కానీ ఎప్పుడైతే తెలంగాణపై కామెంట్ చేశారో ఒక్కసారిగా లైమ్ లైట్ లోకి వచ్చేశారు.  ఎలక్షన్స్ గ్రౌండ్ లో అభ్యర్థులు బ్యాటింగ్ కు దిగకముందే క్యాంపెయిన్ ఇన్నింగ్స్ లో ముందుగా విమర్శల బంతులను వదులుతున్నారు. 

అయితే పవన్ కు మద్దతుగా సినీ ఇండస్ట్రీ ఉంటుంది అని అందరూ ఉహించగా ఇప్పుడు మాత్రం ఉహలకందని విధంగా మొన్నటివరకు పవన్ కు మద్దతు పలికినవారే మొహంపైకి బౌన్సర్స్ లాంటి డైలాగులను వదులుతున్నారు. అందులో కోన వెంకట్ - చిన్ని కృష్ణ - పోసాని కృష్ణ మురళి వంటి రైటర్స్ ఉండటం గమనార్హం. 

మొదట్లో వీళ్ళందరూ పవన్ కు మద్దతు పలికినవారే. తన ఆప్త మిత్రుడని చెప్పుకునే కోన వెంకట్ఏ ఇప్పుడు పవన్ తప్పటడుగులు వేస్తున్నాడని నిలదీస్తుండగా.. పోసాని అయితే ఏకంగా చిరు పాలిటిక్స్ నుంచి చరిత్ర పేజీలను తిప్పేస్తున్నాడు.చిరంజీవి ప్రజారాజ్యం ఓడినప్పుడు బయటకు వెళ్లిన మొదటి వ్యక్తి పవన్ అంటూ.. ఆ సమయంలో చిరు తనకు ఫోన్ చేసి కన్నీరు పెట్టుకున్నట్లు కౌంటర్ ఇచ్చారు. 

ఇక ఇంద్ర రచయిత చిన్నికృష్ణ మొదట్లో పవన్ జనసేన పార్టీపై పై పాజిటివ్ కామెట్ చేసి ఇప్పుడు రివర్స్ అయ్యారు. అసలు పవన్ కు సినిమాల పట్ల ఫోకస్ లేదంటూ.. సినిమా ఇండస్ట్రీలో తెలుగువారిని అతి తక్కువగా గౌరవించే వ్యక్తి పవన్ ఒక్కడే అని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ఈ ముగ్గురి రచయితలు వైఎస్సార్ సిపి పార్టీకి మద్దతు పలుకుతున్న సంగతి తెలిసిందే. మొత్తంగా ఇండస్ట్రీ ఇప్పుడు వైఎస్సార్ సీపీ వైపే ఉండగా పవన్ మాత్రం అస్సలు పట్టించుకోవడం లేదు. ప్రాణ మిత్రుడు అలీ కూడా జగన్ తో కలవడంతో పాలిటిక్స్ ఎంతగా మార్చేస్తాయో అని జనాలు మాట్లాడుకుంటున్నారు. 

అయితే ఈ విమర్శల ఆట ఇంకా అయిపోలేదని టాక్. పవన్ పై టార్గెట్ చేసే సినిమా ఇండస్ట్రీ వాళ్ళు ఇంకా బ్యాటింగ్ లోకి దిగలేదని ఇంకా స్టార్ట్ చేయడానికి కొంత మంది సిద్ధంగా ఉన్నట్లు టాక్. ఇక అప్పటివరకు ఈ బడా రచయితలు పాలిటిక్స్ గ్రౌండ్ లో నాట్ అవుట్ గా ఉంటూ ఫోర్స్ గ్గా డైలాగులతో బౌండరీలు బాదడమే అంటూ నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు.