ఏపీలో ఫ్యాన్ గాలి జోరుగా వీస్తోంది. అంచనాలకు మించి ఏకంగా 140కి పైగా స్థానాల్లో దూసుకుపోతుంది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా సంబరాలు ప్రారంభమయ్యాయి. వైసీపీ  కార్యాలయంతో పాటూ తాడేపల్లిలోని జగన్ నివాసం సందడి కనిపిస్తోంది.

జగన్ గెలుపుపై పార్టీ నేతలతో పాటు ప్రముఖులు, అభిమానులు స్పందిస్తున్నారు. సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా జగన్ కి శుభాకాంక్షలు చెబుతున్నారు. రవితేజ, సుధీర్ బాబు లాంటి సినీ హీరోలు యంగ్ సీఎం కి స్వాగతం అంటూ విషెస్ చెప్పారు.

'యాత్ర' చిత్ర దర్శకుడు మహి వి రాఘవ కూడా వైఎస్సార్ సీపీ విజయంపై స్పందించారు. వైఎస్ కి విషెస్ చెప్పిన ఆయన భవిష్యత్ తరాలకు చెప్పాల్సినంత గొప్ప విజయాన్ని అందించారంటూ ట్వీట్ చేశారు. అంతేకాదు.. ఈ ట్వీట్ కి యాత్ర 2 అనే హ్యాష్ ట్యాగ్ కూడా జత చేశారు.