ఇండియన్ టెలివిజన్ హిస్టరీలో ఎన్నో సీరియల్స్ వచ్చాయి. అయితే వాటిల్లో ఎక్కువగా ఆదరణ పొంది ఏళ్ల తరబడి బుల్లితెర ప్రేక్షకులను అలరించిన క్రైమ్ సీరియల్ ‘సీఐడీ’. ఈ సీరియల్ ఇతర భాషల్లో కూడా అనువాదమై మంచి ఆదరణను అందుకుంది. ముఖ్యంగా తెలుగులో కూడా సీరియల్ మంచి రేటింగ్ ను అందుకుంది. 

1997 నుంచి సోని ఛానల్ లో ప్రసారమవుతున్న ‘సీఐడీ’ కి మొదటి ఎపిసోడ్ నుంచి రీసెంట్ గా వచ్చిన ఎపిసోడ్ వరకు మంచి క్రేజ్ అందుకుంది. రేటింగ్ లో ఎక్కడా తగ్గకుండా సాగుతోన్న సమయంలో సీరియల్ నిర్మాత బీపీ.సింగ్ సడన్ గా సీరియల్ ను ఆపేస్తున్నట్లు తెలుపుతూ.. ఇక ‘సీఐడీ’ ఉండదని చెప్పారు. దాదాపు 21 ఏళ్ల నుంచివస్తోన్న ఈ  సీరియల్ 1546 ఎపిసోడ్లను పూర్తిచేసుకుంది. 

ఇక చివరి ఎపిసోడ్ ఈ నెల 29న ప్రసారం కానుంది. ఇక సీరియల్ లో ఇన్‌స్పెక్టర్ గా నటించిన దయా షో ముగుస్తున్న సందర్బంగా తన వివరణను ఇచ్చాడు. సీరియల్ విషయంలో టీఆర్ పి తో పాటు అంతా బాగానే ఉంది. సీరియల్ మధ్యలో నిర్మాత సీరియల్ ను ముగిస్తున్నట్లు చెప్పడం తమకు ఫ్యాన్స్ కు నీరాశను కలిగిస్తోందని అన్నారు.