Asianet News TeluguAsianet News Telugu

Thangalaan Teaser : వణుకు పుట్టించే సన్నివేశాలతో ‘తంగలాన్’ టీజర్.. చూశారా?

చియాన్ విక్రమ్ మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ ‘తంగలాన్’ టీజర్ విడుదలైంది. ఆసక్తికరమైన యుద్ధ సన్నివేశాలతో ఆకట్టుకుంటోంది. కొన్ని సీన్స్ వణుకుపుట్టించేలా ఉన్నాయి. సినిమాపై ఆసక్తిని పెంచేస్తున్నాయి. 
 

Chiyaan Vikrams Thangalaan  movie Teaser Out NSK
Author
First Published Nov 1, 2023, 2:05 PM IST

తమిళ స్టార్ చియాన్ విక్రమ్ (Vikram)  నటిస్తున్న పీరియాడిక్ డ్రామా ‘తంగలాన్’ (Thangalaan)  అంచనాలను పెంచేస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్ కు సూపర్ రెస్పాన్స్  దక్కింది. ఇక తాజాగా ఆడియెన్స్ కు సినిమాపై ఆసక్తిని పెంచేలా అద్భుతమైన టీజర్ ను విడుదల చేశారు. టీజర్ లోని సన్నివేశాలు వణుకుపుట్టించేలా ఉన్నాయి. విక్రమ్ పెర్ఫామెన్స్ ఆయన కెరీర్ లోనే ది బెస్ట్ అనిపించేలా కనిపిస్తోంది. 

టీజర్ విషయానికొస్తే.. కొన్ని తెగల మధ్య జరిగే యుద్ధ సన్నివేశాలను చూపించారు. యుద్ధవీరుడిగా విక్రమ్ విరోచిత పోరాటాలు చేస్తుంటాడు. తన ప్రజలను కాపాడుకునేందుకు ఎల్లప్పుడూ ముందుంటాడు. టీజర్ లోని సీన్స్ వణుకుపుట్టించేలా ఉన్నాయి. యాక్షన్ సీక్వెన్స్ నెక్ట్స్ లెవల్ అనిపిస్తోంది. ఇక జీవీ ప్రకాశ్ అందించిన నేపథ్య సంగీతం అద్భుతమనే చెప్పాలి. విక్రమ్ ట్రైబ్ గా కనిపించేందుకు ఎంతలా శ్రమించారో తెలిసిందే. అందుకు వెండితెరపై అభిమానులను సర్ ప్రైజ్ చేయబోతున్నాడని తెలుస్తోంది. మాళవికా మోహనన్, ఇతర కాస్ట్ తెగకు చెందిన వారి ఆహార్యంలో ఆకట్టుకున్నారు. పా.రంజిత్ మార్క్ దర్శకత్వం ఈసారి సెన్సేషన్ క్రియేట్ చేయబోతుందనడంలో సందేహం లేదు. 

1870 - 1940 మధ్య కాలంలో ఈ సినిమా కథను చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ప్రయోగాత్మక చిత్రాలకు చిరునామాగా మారిన విక్రమ్ ఈ సినిమా కోసం ఏకంగా 20 కేజీల బరువు తగ్గారు. మునుపెన్నడూ లేని విధంగా తన నటనతో ఆకట్టుకోబోతున్నారు. పార్వతీ తిరువొతు, మాళవికా మోహనన్, పసుపతి కీలక పాత్రలు పోషిస్తున్నారు. 2024 జనవరి 26న ఈ చిత్రం విడుదల కాబోతోంది. తమిళంతో పాటు తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో గ్రాండ్ రిలీజ్ కు ఏర్పాట్లు జరుగుతున్నాయి. రూ.150 కోట్లతో స్టూడియో గ్రీన్, నీలం ప్రొడక్షన్ సంయుక్తంగా నిర్మిస్తోంది. ఈ చిత్రం షూటింగ్ పూర్తై పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది. 


 

Follow Us:
Download App:
  • android
  • ios