Asianet News TeluguAsianet News Telugu

చియాన్ విక్రమ్ ‘ధృవ నక్షత్రం’ ట్రైలర్.. తెలుగు వెర్షన్ చూశారా?

చియాన్ విక్రమ్ స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘ధృవ నక్షత్రం’  రిలీజ్ కు సిద్ధమవుతోంది. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ విడుదలై ఆకట్టుకుంటోంది. అదిరిపోయే యాక్షన్, స్టంట్లతో విక్రమ్ అదరగొట్టారు.  
 

Chiyaan Vikrams Dhruva Nakshathram Telugu Official Trailer NSK
Author
First Published Nov 9, 2023, 6:39 PM IST

తమిళ స్టార్ హీరోయిన్ చియాన్ విక్రమ్ (Chiyaan Vikram)  నటించిన స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘ధృవ నక్షత్రం’ (Dhruva Nakshatram).  ఆరేళ్లుగా ఈ మూవీ విడుదలకు నోచుకోలేదు. ప్రముఖ దర్శకుడు గౌతమ్ వసుదేవ్ మీనన్ డైరెక్షన్ లో రూపుదిద్దుకున్న ఈ చిత్రం ఎట్టకేళ్లకు రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా మేకర్స్ రిలీజ్ డేట్ ను కూడా అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. దీంతో ప్రమోషన్స్ పై ఫోకస్ పెట్టారు. ఈ సందర్భంగా ఇప్పటికే తమిళంలో చిత్ర ట్రైలర్ ను విడుదల చేసి మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నారు. 

ఇక తాజాగా తెలుగు వెర్షన్ లో ‘ధృవ నక్షత్రం’ ట్రైలర్ ను విడుదల చేశారు. ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంటోంది. 2008లో ముంబైలో జరిగిన టెర్రరిస్ట్ ల దాడి నేపథ్యంలో చిత్రాన్ని రూపొందించారని తెలుస్తోంది. విక్రమ్ జాన్ అనే పాత్రలో స్పై, కోవర్ట్ ఆపరేటివ్ గా కనిపించబోతున్నారు. ’ది బేస్‌మెంట్‘ అని పిలువబడే ఉన్నత నిపుణుల బృందానికి నాయకుడు. శాంతిభద్రతలకు కట్టుబడి ఉండకుండా,  రహస్యంగా ఉగ్రవాద సంస్థలను తొలగించాలనే ఏకైక ఉద్దేశ్యంతో ఆ టీమ్ పనిచేస్తుంది. టెర్రరిస్టులను మట్టుబెడుతుంటుందనే ట్రైలర్ ద్వారా అర్థమువతోంది. 

ట్రైలర్ లోని యాక్షన్ సీన్లు,  విక్రమ్ స్టంట్లు సూపర్ అనిపించేలా ఉన్నాయి. థ్రిల్లింగ్ అంశాలు సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి. హరీస్ జయరాజ్ అందించిన నేపథ్య సంగీతం ఆకట్టుకునేలా ఉంది. చిత్రానికి గౌతమ్ వసుదేవ్ మీనన్ దర్శకత్వం వహించారు. ఓండ్రగ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై గౌతమ్ మీనన్ నే నిర్మించారు. రీతూ వర్మ, ఐశ్వర్య రాజేశ్ హీరోయిన్లు. నవంబర్ 24న గ్రాండ్ గా విడుదల కాబోతోంది. 

 

Follow Us:
Download App:
  • android
  • ios